హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంచిర్యాలలో దారుణం... ఠాగూర్ సీన్ రిపీటైంది

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం అందదు అనడానికి ఇదొక ఉదాహారణ. మంచిర్యాల ఏరియా ఆసుపత్రిలో ఈ దారుణం జరిగింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్షానికి ఓ నిండు ప్రాణం బలైంది. బాధితుడు గాజిరెడ్డి అంకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

సిర్పూర్(టి)కు చెందిన గాజిరెడ్డి పోచక్క (45), ఆమె భర్త బక్కయ్య పిల్లలతో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాజిరెడ్డి పోచక్క తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మంచిర్యాల ఏరియా ఆసుపత్రికి రాత్రి 8 గంటల ప్రాంతంలో తీసుకువచ్చారు.

అదే టైమ్‌లో డిప్యూటీ సీఎం టి. రాజయ్య రాత్రి ఆసుపత్రిలో బస ఉండగా, వైద్యులు, సిబ్బంది ఆయన వద్దకు వెళ్లారు. పోచక్కను ఆసుపత్రిలో చేర్పించుకోకుండా సుమారు 30 నిమిషాల పాటు పార్కింగ్ ప్లేస్ వద్ద కూర్చోబెట్టారు.
డిప్యూటీ సీఎం టీ. రాజయ్య ప్రోగ్రాం కవర్ చేయడానికి వచ్చిన మీడియా పోచక్కను గమనించడంతో ఆసుపత్రి సిబ్బంది పోచక్కను లోపలికి తీసుకుపోయారు.

అక్కడ డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్, డిప్యూటీ సీఎం కార్యక్రమంలో ఉండిపోయాడు. దీంతో ట్రైనీ వైద్యుడు సిటీ స్కాన్ చేసుకు రమ్మని వారికి సూచించి వెళ్లిపోయాడు. వచ్చిన బంధువులు ఎక్కడికి వెళ్లాలో తెలియక అక్కడే ఉండిపోయారు. ఆసుపత్రిలో ఉన్న ఇతర వైద్యులు, సిబ్బంది కూడా పోచక్కను పట్టించుకోలేదు.

Dead body referred by doctors in mancherial area hospital

దీంతో రాత్రి నుంచి ఉదయం వరకు నోప్పితో అల్లాడిపోయిన పోచక్క ఆవేదను చూసిన కొడుకు అంకులు ఉదయం 5.10 గంటలకు నర్సులను బతిమిలాడటంతో ఇంజెక్షన్ చేశారు. అతడు మళ్లీ నొప్పి తగ్గలేదని 30 నిమిషాల తర్వాత రాగా, వాచ్‌మెన్ బెదిరించడంతో వెళ్లిపోయాడు. తర్వాత 6.50 గంటలకు పోచక్క మరణించింది.

ఈ విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది మీ అమ్మకు సీరియస్‌గా ఉంది. వెంటనే తీసుకుపొంజి అంటూ వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. పోచక్క కుమారుడు అంకులు వెంటనే అంబులెన్స్‌ను తీసుకువచ్చాడు. చనిపోయిన శవాన్ని అంబులెన్స్‌లో ఎక్కించేందుకు అక్కుడన్న సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్సిస్తుండగా... రాజయ్య కోసం వచ్చిన మీడియా దాన్ని గమనించింది.

అసలు విషయం తెలిసి మీడియా కూడా అవాక్కైంది. డాక్టర్లు రాజయ్య హడావుడిలో పడి తన తల్లిని చూడకపోడవం వల్లే చనిపోయందని పోచక్క కుమారుడు అంకులు తన ఆవేదనను వెళ్లగక్కాడు. దీంతో డ్యూటీలో ఉన్న డాక్టర్ వైవీఎస్ మూర్తిని సంప్రదిస్తే పోచక్క పరిస్ధితి విషమంగా ఉండటంతోనే తాము వేరే ఆసుపత్రికి రిఫర్ చేశామని... ఇంతలోనే ఆమె చనిపోయిందని చెప్పాడు. పైన జరిగిన ఉదంతాన్ని చూస్తుంటే ఠాగూర్ సినిమా సీన్ లాగే ఉంది.

English summary
Dead body referred by doctors in mancherial area hospital in Telangana State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X