షాక్: థమ్సప్ బాటిల్‌లో చచ్చిన బల్లులు!
థమ్సప్ బాటిల్‌లో చనిపోయిన బల్లులు కనిపించిన ఘటన వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లో బుధవారం జరిగింది.
వనపర్తి: చల్లని పానీయాలను ఇష్టంగా సేవించే వారికి ఈ వార్త షాక్‌కు గురిచేస్తుంది.వినియోగదారుల ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా ధనార్జనే లక్ష్యంగా కొన్ని ఉత్పత్తి సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
ఇందుకు నిదర్శనమే తాజాగా, థమ్సప్ బాటిల్‌లో చనిపోయిన బల్లులు కనిపించడం. ఈ ఘటన వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. శ్రీరంగాపూర్‌లోని వెంకటయ్య దుకాణానికి అక్టోబర్ 27, 2016న తయారైన తేదీతో థమ్సప్ కూల్‌డ్రింక్స్ సరఫరా అయ్యాయి.

బుధవారం గ్రామా నికి చెందిన ఓ వ్యక్తి థమ్సప్ కొనేందు కు రాగా, షాపు యాజమాని మల్లయ్య బాటిల్ ఇవ్వబోతుండగా బల్లులు ఉండటాన్ని గుర్తించాడు. వెంటనే విషయాన్ని పెబ్బేరులోని కూల్‌డ్రింక్స్ డీలర్ దృష్టికి తీసుకెళ్లాడు.
ఈ విషయంపై కంపెనీ యాజమాన్యానికి డీలర్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాగా, ఇలాంటి ఘటనలు గతంలో కూడా చోటుచేసుకున్నాయి. పలు చల్లనీ పానీయాల్లో పురుగులు, చిన్న వానపాములు కూడా గతంలో ఆ బాటిళ్లలో రావడం గమనార్హం.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications