కోడలి మరణం తట్టుకోలేకపోయిన మామ..గంటల వ్యవధిలోనే షాక్ లో గుండెపోటుతో మృతి!!
కోడలు అకాల మరణం చెందడంతో, ఆ విషయం తెలిసిన మామ గుండెపోటుతో మృతి చెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తలోడి గ్రామ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
తలోడి గ్రామానికి చెందిన 75 సంవత్సరాల వయసున్న జాడి జూలాజీ పెద్ద కుమారుడు అయిన గోప్లా భార్య 30 సంవత్సరాల వయసున్న లలిత గర్భవతి కావడంతో ఆమెకు కాగజ్ నగర్ లోని ఒక ఆసుపత్రిలో కాన్పు చేశారు. శస్త్రచికిత్స చేసి డెలివరీ చేసిన వైద్యులు, ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా నిర్వహించి ఆపై ఆమెను ఇంటికి పంపించారు. మంగళవారం మధ్యాహ్నం మంచిర్యాలలో ఉన్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు.

ఇక కోడలు మృతి గురించి తెలుసుకున్న మామ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 75 సంవత్సరాల జాడీ జూలాజీ కోడలి మరణాన్ని జీర్ణించుకోలేక పోయాడు. ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలాడు. ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది . అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఒకే రోజు ఒకే కుటుంబానికి చెందిన మామ, కోడలు మృతి చెందడంతో తలోడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గంటల వ్యవధిలోనే మామ, కోడలు మృతి చెందడం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో మునిగింది.
ఇక ఈ ఘటనలో మామ సడన్ గా కోడలు మరణవార్త వినటంతో షాక్ కు గురై కార్డియాక్ అరెస్ట్ బారిన పడ్డాడు. ఆపై ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్ళినా ఫలితం లేకుండా పోయింది. అందుకే కొంతమంది మానసికంగా బలహీనంగా ఉన్న వారికి తట్టుకోలేని విషాద ఘటనలు ఏవైనా జరిగితే వెంటనే చెప్పకుండా నిదానంగా వారికి అర్ధం అయ్యేలా చెప్పటం మంచిదని అంటున్నారు. ఇక ఇటీవల కాలంలో కార్డియాక్ అరెస్ట్ లు ఎక్కువగా జరుగుతున్న కారణంగా అందరూ గుండె ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications