అసెంబ్లీలో నేరుగా బడ్జెట్‌పైనే చర్చ: ప్రశ్నోత్తరాలు రద్దు

బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఒక్కరోజు విరామం తర్వాత శనివారం తిరిగి సమావేశం కానుంది. గురువారం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్‌పై సభ్యులు అధ్యయనం చేసి రేపటి(శనివారం) సభలో చర్చలో పాల్గొనేందుకు శుక్రవారం సెలవు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశం కానున్నాయి. అయితే, ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాలు రద్దు చేసి, నేరుగా బడ్జెట్ పద్దుపై చర్చకు అవకాశం కల్పించారు. దీంతో ఉదయం 10 గంటల నుంచే ఉభయ సభల్లోనూ బడ్జెట్‌పై సాధారణ చర్చ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొదట శాసనసభలో సమాధానం ఇస్తారు. అనంతరం శాసనమండలిలోనూ ఆయన సమాధానమిస్తారు.

Debate on budget in Telangana assembly on Saturday


2.19 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్

తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌తో పోలిస్తే కాస్త ఎక్కువగా 2 లక్షల 91వేల 159 కోట్ల రూపాయలతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పద్దును ప్రవేశపెట్టారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, హామీల అమలే లక్ష్యంగా రూ. 2 లక్షల 91వేల 159 కోట్లతో రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి శాసనసభకు సమర్పించారు.

ఇందులో రెవెన్యూ రాబడి రూ. 2 లక్షల 21వేల 242 కోట్లు, మూలధన రాబడి రూ.69వేల 572 ఉంటుందని అంచనా వేశారు. రెవెన్యూ రాబడిలో పన్నుల ద్వారా రూ. లక్షా 38వేల 181 కోట్లు, పన్నేతర ఆదాయం రూ. 35వేల 208 కోట్లు వస్తుందని డిప్యటీ సీఎం పేర్కొన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ. 26వేల 216 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్ల ద్వారా 21వేల 636 కోట్ల రూపాయలు వస్తాయని ప్రతిపాదించారు. బహిరంగ మార్కెట్‌లో రుణాల ద్వారా రూ. 57వేల 112 కోట్లు, కేంద్రం నుంచి రుణాల ద్వారా రూ. 3 వేల 900కోట్లు, ఇతర రుణాల ద్వారా వెయ్యి కోట్లు సమకూర్చుకుంటామని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+