తెలంగాణాలో భరించలేని ఉక్కపోత.. కారణమిదే!
తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణం చోటు చేసుకుంటుంది. గతానికి భిన్నంగా విపరీతమైన చెమట, జిడ్డు చిరాకుకు గురిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి నెల ముగియటంతో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రం అంతా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇంకా రెండు రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
తెలంగాణాలో భరించలేని ఉక్కపోత
ఇదిలా ఉంటే రాష్ట్రంలో 16 జిల్లాలలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా గోధూరులో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. సాధారణం కంటే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇది ఇలా ఉంటే రాష్ట్రమంతా ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. గాలిలో తేమశాతం పడిపోవడంతో తీవ్రమైన వేడితో ప్రజలు అల్లాడిపోతున్నారు.

మారుతున్న తెలంగాణా వాతావరణం
ఎండ తీవ్రత ఎంత ఉన్నా, ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదైనప్పుడు కూడా గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉక్కపోత సమస్య పెద్దగా ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉక్కపోత సమస్య మొదటి నుంచి తీవ్రంగా ఉంది. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా వాతావరణం మారుతుంది. తేమ శాతం పడిపోవడంతో ఒళ్లంతా జిడ్డుగా చిరాకుగా అనిపిస్తుంది.
తగ్గుతున్న గాలిలో తేమ శాతం
గాలిలో తేమశాతం ఎక్కువగా ఉంటే కొంత చల్లదనం ఉంటుంది. తేమశాతం ఎక్కువ లేకపోతే వేడి ఎక్కువగా అనిపిస్తుంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలోనే అతి తక్కువ తేమశాతం హైదరాబాద్ లో నమోదయింది. హైదరాబాదులో 26% మాత్రమే తేమ నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. దీనికి పర్యావరణ కాలుష్యమే కారణమని ప్రధానంగా భావిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి దారుణం
ఇక ఆదిలాబాద్ లో గాలిలో తేమ శాతం 27 శాతం, మహబూబ్నగర్లో 30% నల్గొండ 31 శాతం, భద్రాచలంలో 35%, ఖమ్మం లో 41 శాతం, రామగుండం, హనుమకొండలో 44%, నిజామాబాద్ ల 46% నమోదయింది. కాగా నేటి నుంచి పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.












Click it and Unblock the Notifications