తెలంగాణా మాజీ సీఎం కేసీఆర్ ఇంట తీవ్ర విషాదం.. బీఆర్ఎస్ కీలక భేటీ వాయిదా!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కెసిఆర్ సోదరి చీటీ సకలమ్మ నిన్న రాత్రి కన్నుమూశారు. 82సంవత్సరాల వయసున్న సకలమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో, వయసు మీద పడడంతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వయోభారంతో వచ్చిన అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో కేసిఆర్ కుటుంబంలో విషాదం చోటు చేసుకున్నట్టైంది.
కేసీఆర్ సోదరి మృతి
సకలమ్మ మరణ వార్త విని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. ఇక కేసీఆర్ ఐదవ సోదరి సకలమ్మ అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నారు. తన సోదరి సకలమ్మ మరణం పట్ల కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

సకలమ్మ మృతితో కీలక భేటీ వాయిదా వేసిన కేటీఆర్
ఇక సకలమ్మ మరణంతో బి ఆర్ ఎస్ పార్టీ నిర్వహించిన కీలక సమావేశాన్ని నేడు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నాయకులతో భేటీ కావలసి ఉండగా సకలమ్మ మృతితో ఈ సమావేశాన్ని వాయిదా వేశారు.
కేసీఆర్ కుటుంబ బంధాలకు ప్రాధాన్యత
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మొత్తం పదిమంది తోడబుట్టిన వారు ఉన్నారు. వీరిలో 8 మంది అక్కలు, ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు. 2018 వ సంవత్సరంలో కెసిఆర్ రెండవ సోదరి విమలాబాయి, మరో సోదరి లీలమ్మ మృతి చెందారు. కెసిఆర్ కుటుంబ బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ప్రతి సంవత్సరం అక్కాచెల్లెళ్లతోటి కెసిఆర్ రాఖీ కట్టించుకుంటారు.
కేసీఆర్ సోదరి మృతి పట్ల బీఆర్ఎస్ శ్రేణుల సంతాపం
కేసీఆర్ వారిపట్ల ఎంతో ప్రేమను వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం సోదరి సకలమ్మ మృతితో కేసీఆర్ బాధాతప్త హృదయంతో ఉన్నారు. ఇక కేసీఆర్ సోదరి చీటీ సకలమ్మ భర్త హన్మంత రావు కొన్నేళ్ళ క్రితం మరణించారు. ఆమెకు ముగ్గురు పిల్లలు. కేసీఆర్ సోదరి మృతి పట్ల బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కెసిఆర్ ఈ వేదన నుంచి త్వరగా కోలుకోవాలని వారంతా కోరుతున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications