పార్టీ ఫిరాయించిన వారంతా బిచ్చగాళ్ళు .. ప్రజాక్షేత్రంలో అవమానించండి అన్న కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కేంద్రమాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు . కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీకి వెళ్తున్న వారంతా యాచకులు అంటూ ఆయన ఫైర్ అయ్యారు .
గాంధీభవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభినందన సభలో పాల్గొన్న ఆయన పార్టీ ఫిరాయింపులు సరికాదన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే గెలిచాక పార్టీ మారటం ప్రజలకు, అవకాశం ఇచ్చిన పార్టీకి ద్రోహం చెయ్యటమే అని ఆయన మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన వారు బిచ్చగాళ్లతో సమానం అని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వారికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి .

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ప్రజల మధ్యలో అవమానించాలని సూచించారు.ఇక ఫిరాయింపుదారులు కాంగ్రెస్ పార్టీ నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. ఇకపోతే లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటింగ్ నమోదైందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పాలని జైపాల్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications