ఢిల్లీ లిక్కర్ కేసు: 10 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ, ఇంటికి చేరుకున్న కవిత, మరోసారి పిలుపు

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ ముగిసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు రెండోసారి హాజరైన కవితను అధికారులు 10 గంటలకుపైగా విచారించారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ ముగిసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు రెండోసారి హాజరైన కవితను అధికారులు 10 గంటలకుపైగా విచారించారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి ఈడీ అధికారులు ఆమెను రాత్రి 9.15 గంటల వరకు విచారించారు. విచారణ అనంతరం ఢిల్లీలోని నివాసంకు చేరుకున్నారు కవిత.

పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఎమ్మెల్సీ కవితను అధికారులు ప్రశ్నించారు. లిక్కర్ కేసులో మనీలాండరింగ్ అంశంలో ఆమెపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఒకవైపు కవిత విచారణ కొనసాగుతుండగానే.. తెలంగాణ అదనపు ఏజీ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

Delhi liquor case: ED enquiries MLC Kavitha for 10 hours

గత వారం కవితకు ఈడీ నోటీసులు జారీ చేసినా.. ఆమె విచారణకు హాజరుకాలేదు. తాను దాఖలు చేసిన పిటిషన్ ను మార్చి 24న సుప్రీంకోర్టు విచారించనుందని, కోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వేచిచూడాలని కవిత మార్చి 16న లేఖ ద్వారా ఈడీకి విజ్ఞప్తి చేశారు. అయితే, సోమవారం ఈడీ మళ్లీ నోటీసులు ఇవ్వడంతో కవిత విచారణకు హాజరయ్యారు.

కాగా, విచారణ సమయంలోనే కవిత తరపున ముగ్గురు లాయర్లు ఈడీ ఆఫీసులోకి వెళ్లడం.. ఆ తర్వాత ఇద్దరు వైద్య సిబ్బంది ఆఫీసులోకి వెళ్లి రావడం, అందులో ఓ మహిళా డాక్టర్ ఉండటంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే, కవిత సోమవారం రాత్రి ఈడీ ఆఫీసు నుంచి ఢిల్లీలోని నివాసానికి చేరుకున్నారు. ఈడీ ఆఫీసు నుంచి ఆమె నవ్వుతూ బయటికి వచ్చారు. కారులోంచి విక్టరీ సింబల్ చూపించారు.

కాగా, మంగళవారం ఉదయం 11 గంటలకు మరోసారి విచారణకు హాజరుకావాలని కవితను కోరింది ఈడీ. ఈ క్రమంలో రేపు కూడా ఆమె విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+