హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు.. ఐటీ కంపెనీలు, బిల్డర్ల ఇళ్లలో సోదాలతో టెన్షన్!!

హైదరాబాద్లో మరోమారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల సోదాలు కలకలంగా మారాయి. దాదాపు పది చోట్ల సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. 3 ఐటీ కంపెనీలతో పాటు కరీంనగర్ కు చెందిన పలువురు బిల్డర్ల ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల ప్రత్యేక బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. రెండు రియల్ ఎస్టేట్ కార్యాలయాల్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఈ దాడులు కొనసాగుతున్నాయా? లేదా మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది.

హైదరాబాద్ లో ఈడీ సోదాల ప్రకంపనలు.. రామచంద్రన్ పిళ్ళై విచారణ

హైదరాబాద్ లో ఈడీ సోదాల ప్రకంపనలు.. రామచంద్రన్ పిళ్ళై విచారణ

ఇదిలా ఉంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఇటీవల దేశవ్యాప్తంగా 40కిపైగా చోట్ల దాడులు నిర్వహించి అనేక మంది వ్యక్తులకు, కంపెనీలకు నోటీసులు అందజేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఉన్న నిందితులలో ఒకరైన రామచంద్రన్ పిళ్ళై యాజమాన్యంలోని రాబిన్ డిస్టిలరీస్ కార్యాలయంలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం రామచంద్రన్ పిళ్ళై ను ఈడీ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.

12 మంది వ్యక్తులకు 18 కంపెనీలకు నోటీసులు

12 మంది వ్యక్తులకు 18 కంపెనీలకు నోటీసులు

ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు వ్యక్తిగత అకౌంటెంట్ గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు కు చెందిన గోరంట్ల అసోసియేట్స్ కార్యాలయం పైన, ఆయన నివాసం పైన కూడా ఈడీ అధికారులు దాడులు చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో పలు కంపెనీలకు సంబంధించిన కీలక ఫైళ్లను గుర్తించిన ఈడీ అధికారులు, హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా 12 మంది వ్యక్తులకు 18 కంపెనీలకు నోటీసులు అందజేశారు.

రామచంద్రన్ పిళ్ళై నుండి వివరాలు రాబట్టే పనిలో ఈడీ

రామచంద్రన్ పిళ్ళై నుండి వివరాలు రాబట్టే పనిలో ఈడీ

అంతేకాదు గచ్చిబౌలిలోని అభిషేక్ రావు నివాసం, మాదాపూర్ లోని అనూస్ ప్రధాన కార్యాలయం లోనూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కి చెందిన ఢిల్లీ నెల్లూరు నివాసాల్లోనే ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. నెల్లూరు లో ఉన్న శ్రీనివాసులు రెడ్డి కార్యాలయం, చెన్నైలోని మాగుంట అగ్రి ఫామ్ లో కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.

ఇక ఈ కేసులో నోటీసులు ఇచ్చిన వారిని విచారిస్తున్న ఈడీ అధికారులు రామచంద్రన్ పిళ్ళై నుండి వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. ఇప్పుడు మరోమారు ఈడీ అధికారులు హైదరాబాద్లో దాదాపు పది చోట్ల తనిఖీలు చేయడం ఆసక్తిని రేకెత్తిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+