ఢిల్లీ లిక్కర్ స్కామ్ రగడ: ఆ బీజేపీ నేతలపై పరువునష్టందావా వేసిన ఎమ్మెల్సీ కవిత
దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న లిక్కర్ స్కామ్ ప్రకంపనలు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్రిక్తతలకు కారణంగా మారాయి. లిక్కర్ మాఫియాలో తెలంగాణ సీఎం కుమార్తె కల్వకుంట్ల కవిత పాత్ర ఉందని, కెసిఆర్ కుమార్తె కవిత ఆధ్వర్యంలోనే ఢిల్లీలోని ఓబెరాయ్ హోటల్లో లిక్కర్ సెటిల్మెంట్లు జరిగాయని బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సా చేసిన ఆరోపణలతో ఒకసారిగా లిక్కర్ చిక్కుల్లో కవిత చిక్కుకున్నట్లు అయింది. దీంతో తెలంగాణాలో ఆందోళనలు ఉద్రిక్తంగా మారాగా ఎమ్మెల్సీ కవిత తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

పరువునష్టం దావా వేసిన ఎమ్మెల్సీ కవిత
ఈ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన ఆమె పరువు నష్టం దావా వేశారు. తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లా కోర్టులలో పిటీషన్లు దాఖలు చేశారు. ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సా చేసిన ఆరోపణలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడిన ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు ఏ విధమైన సంబంధం లేదని తేల్చి చెప్పారు. దీనిపై న్యాయస్థానంలో తేల్చుకుంటా అని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు.

భయపడం.. న్యాయస్థానంలో తేల్చుకుంటాం : కవిత
ఇక ఇప్పటికే బిజెపి నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని మండిపడిన కవిత తనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు కక్షపూరిత రాజకీయాలకు తెర తీశారని, అందులో భాగంగా బట్ట కాల్చి మీద వేస్తున్నారని నిన్ననే ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. తెలంగాణా సీఎం కేసీఆర్ ను భయపెట్టాలని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ బిడ్డను బద్నాం చేస్తే కెసిఆర్ భయపడతారని భావిస్తున్నారని, కానీ భయపడేది లేదని, న్యాయస్థానంలో తేల్చుకుంటామని స్పష్టం చేశారు.

కేసీఆర్ ను మానసికంగా క్రుంగదీయాలనే ఇదంతా
ఇక ఇటువంటి ప్రయత్నం వ్యర్థ ప్రయత్నంగానే మిగిలిపోతుందని, మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు, ప్రభుత్వం పోరాట పటిమ ఉన్నవారిమని, భయపడి వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.కెసిఆర్ ని మానసికంగా క్రుంగదీయాలని చూస్తున్నారని విమర్శించిన కవిత పోరాటం ఆపమని స్పష్టం చేశారు .ఇక దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఇక తాజా పరిణామాల నేపధ్యంలో కవిత ఇంటివద్ద పోలీసులు బందోబస్తును పెంచారు.

కవిత ఇంటిపై దాడి చేసిన 29 మంది బీజేపీ కార్యకర్తలపై ఎఫ్ఐఆర్
ఇక ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడికి పాల్పడిన బిజెపి కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ఎమ్మెల్సీ కవిత ఇంటి పై దాడి చేసిన 29 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు బంజారా హిల్స్ సిఐ నరేందర్ తెలిపారు. వారిలో ఇప్పటివరకు 26 మందిని అరెస్ట్ చేశామని, ముగ్గురు పరారీలో ఉన్నారని వెల్లడించారు. ఇక నిందితులపై ఐపీసీ 341, 147, 148, 332, 353, 509, r/w 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు గా పోలీసులు వెల్లడించారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications