ఢిల్లీ వెంకయ్య, గల్లీ బాబుల కుట్ర: సుమన్, కెసిఆర్‌ని కలిసిన సైరస్‌మిస్త్రీ
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఢిల్లీ వెంకయ్య నాయుడు, గల్లీ చంద్రబాబు నాయుడుల కుట్ర వల్లనే హైకోర్టు విభజన జరగడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు బాల్క సుమన్, బూర నర్సయ్య గౌడ్‌లు గురువారం ఢిల్లీలో ఆరోపించారు.
హైకోర్టు విభజన కోసం అన్ని పార్టీలు కలిసి రావాలన్నారు. ఏడాది అయినా హైకోర్టు విభజన జరగకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర హక్కులు, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తాము తమ పోరాటం చేస్తామని చెప్పారు.
హైకోర్టు విభజన పైన పార్లమెంటును స్తంభింప చేస్తామని చెప్పారు. స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ నిరసన కొనసాగుతుందన్నారు. తాము సభను అడ్డుకుంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా వెనుకడుగు వేసేది లేదన్నారు. హైకోర్టు విభజన జరగక పోవడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామని చెప్పారు.

హరీష్ రావు పట్ల డికె అరుణ అసభ్యంగా మాట్లాడారు: ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డికె అరుణ అసభ్యంగా మాట్లాడారని ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు అన్నారు. నీళ్లు, నిధుల కోసమే మన పోరాటం అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. డికె అరుణ తీరు మహిళలు సిగ్గుపడేలా ఉందన్నారు.
కెసిఆర్‌ను కలిసిన సైరస్ మిస్తీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ గురువారం నాడు కలిశారు. హైదరాబాదులో ఆయన కెసిఆర్‌ను కలిశారు. అంతకుముందు మంత్రి కెటిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. టాటాతో ఐటీ, రీసెర్చ్‌తో దీర్ఘకాలిక అనుబంధం ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications