వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశ్ కా పీఎం కేసీఆర్: ఢిల్లీలో కెసీఆర్ మహాధర్నాలో ఆసక్తికర నినాదాలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టిఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన టిఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించింది. ఇక తాజాగా ఢిల్లీ వేదికగా సీఎం హోదాలో కెసిఆర్ తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కేంద్రం కొనుగోలు చేయాలని, అలాగే దేశం మొత్తం ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా నిర్వహించారు. అయితే ఈ మహాధర్నా కార్యక్రమంలో ఆసక్తికర నినాదాలు చర్చనీయాంశంగా మారాయి.

ఢిల్లీలో దేశ్ కా పీఎం కేసీఆర్ అంటూ నినాదాలు

ఢిల్లీలో దేశ్ కా పీఎం కేసీఆర్ అంటూ నినాదాలు

దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ మహాధర్నా నేపధ్యంలో ఎక్కడ చూసినా తెలంగాణ సీఎం కేసీఆర్ కటౌట్లు, బ్యానర్లు కనిపించాయి. ఢిల్లీలో చాలా చోట్ల గులాబీ బ్యానర్లు వెలిశాయి. దేశ్ కీ నేత కెసీఆర్ అంటూ పెద్ద పెద్ద హోర్డింగులు కనిపించాయి. ఇక కేసీఆర్ పాల్గొన్న మహాధర్నాలో పాల్గొన్న నాయకులు, అభిమానులు, రైతులు దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కొందరు ఏకంగా దేశ్ కా పీఎం కేసీఆర్ అంటూ నినాదాలు చేయడం ఆసక్తికరంగా మారింది.

కేసీఆర్ ఢిల్లీ మహా ధర్నా... జాతీయ నేతగా కేసీఆర్ గుర్తింపు కోసమేనా?

కేసీఆర్ ఢిల్లీ మహా ధర్నా... జాతీయ నేతగా కేసీఆర్ గుర్తింపు కోసమేనా?

జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో, కేసీఆర్ తాజాగా నిర్వహించిన మహాధర్నా కూడా ఆ విషయాన్ని స్పష్టం చేసింది. కేసీఆర్ జాతీయస్థాయి రాజకీయాలలో తానూ కీలకంగా ఉన్నానని, రాష్ట్రం కోసమే కాకుండా దేశంలోని రైతులందరి కోసం కెసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తానన్న అభిప్రాయం ప్రజలకు కలిగేలా నిర్వహించారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

 దేశ్ కీ నేత అనిపించుకోవటం కోసమే కేసీఆర్ ధర్నాలు

దేశ్ కీ నేత అనిపించుకోవటం కోసమే కేసీఆర్ ధర్నాలు

సీఎం కేసీఆర్ నిర్వహించిన రైతు దీక్ష కార్యక్రమంలో రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ కూడా హాజరుకావటంపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది. కేసీఆర్ దేశ్ కి నేత అనిపించుకునే ప్రయత్నంలో భాగంగా కెసిఆర్ ఢిల్లీలో మహా ధర్నా నిర్వహించారని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. అటు బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు కెసీఆర్ రాజకీయాల కోసమే వడ్ల డ్రామాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇక ఇదే క్రమంలో ఢిల్లీ వేదికగా సాగిన ఆందోళనలో దేశానికి ప్రధానిగా కెసిఆర్ కావాలని ఆకాంక్షను వ్యక్తం చేస్తూ నినాదాలు చేయడం ఆసక్తికర పరిణామంగా మారింది.

జాతీయ రాజకీయాలలో కీలక నేతగా ఎదిగే యత్నం చేస్తున్న కేసీఆర్

జాతీయ రాజకీయాలలో కీలక నేతగా ఎదిగే యత్నం చేస్తున్న కేసీఆర్

ఇప్పటికే వివిధ బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలతో భేటీ అయ్యి వారందరినీ ఏకతాటి మీదకు తీసుకొచ్చి బీజేపీ వ్యతిరేక పోరాటం చెయ్యాలని భావిస్తున్న కెసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా ఎదగటం కోసం శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఢిల్లీ వేదికగా చేసిన మహాధర్నాను కెసీఆర్ జాతీయ నేతగా ప్రమోట్ చెయ్యటానికి వాడుకున్నారన్న వాదన వినిపిస్తుంది.

తెలంగాణాకే పరిమితమైన నేతను కాదని కేసీఆర్ చెప్పే ప్రయత్నంగా చూస్తున్న రాజకీయ వర్గాలు

తెలంగాణాకే పరిమితమైన నేతను కాదని కేసీఆర్ చెప్పే ప్రయత్నంగా చూస్తున్న రాజకీయ వర్గాలు

ఇక కెసిఆర్ తన సొంత పబ్లిసిటీ కోసం, జాతీయ నేతగా గుర్తింపు కోసం తెగ తాపత్రయపడుతున్నారని, తాను తెలంగాణకే పరిమితమైన నేతను కాదని జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నానని సంకేతాన్ని ఇస్తున్నారని, అందులో భాగంగానే ఢిల్లీ వేదికగా సీఎం హోదాలో ఆందోళనలు చేశారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కేవలం జాతీయ రాజకీయాలలో గుర్తింపు కోసం కెసిఆర్ ఢిల్లీ కేంద్రంగా ధర్నాలు చేస్తున్నారంటూ తెలంగాణలో జోరుగా చర్చ జరుగుతోంది.

English summary
Desh Ka PM KCR, fans chanted interesting slogans during the KCR maha dharna in Delhi. Opposition parties have criticized KCR for holding the dharna in recognizing kcr as the national leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X