Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ద‌ళితుల‌కు తీరని అన్యాయం.!కేసీఆర్ ఘ‌రానా మోస‌గాడన్న షర్మిళ.!

నల్లగొండ/హైదరాబాద్ : శుక్రవారం వాయిదా ప‌డిన చోటు నుంచే పాదయాత్ర‌ను తిరిగి మొద‌లుపెట్టారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయ‌స్ ష‌ర్మిళ. లోట‌స్ పాండ్ లోని పార్టీ కార్యాల‌యం నుంచి పార్టీ శ్రేణులతో క‌లిసి భారీ కాన్వాయ్ తో కొండ‌పాక‌గూడెం గ్రామానికి బ‌య‌లుదేరారు. సాయంత్రం 3.30 గంట‌ల‌కు పాద‌యాత్ర పునఃప్రారంభించారు. ష‌ర్మిళ వెంట పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భారీగా క‌దిలారు. ప్ర‌జ‌ల‌ను ప‌లక‌రిస్తూ, వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ వైయ‌స్ ష‌ర్మిళ ముందుకు సాగారు. కొండ‌పాకగ నుంచి చిన్ననారాయ‌ణ‌పురం, నార్కెట్ ప‌ల్లి, మడ ఎడవెల్లి మీదుగా సాగింది. సాయంత్రం పోతినేనిపల్లి క్రాస్ కు చేరుకున్నారు.

 షర్మిళ పాద‌యాత్ర పునఃప్రారంభం..భారీగా త‌ర‌లివ‌చ్చిన వైయ‌స్ఆర్ అభిమానులు

షర్మిళ పాద‌యాత్ర పునఃప్రారంభం..భారీగా త‌ర‌లివ‌చ్చిన వైయ‌స్ఆర్ అభిమానులు

22వ రోజు పాద‌యాత్ర 10.4 కిలోమీట‌ర్ల మేర సాగింది. నార్కెట్ ప‌ల్లిలో నిర్వ‌హించిన ప‌బ్లిక్ మీటింగ్‌లో వైయ‌స్ ష‌ర్మిల గారితో పాటు విజ‌య‌మ్మ గారు కూడా హాజ‌రై ప్ర‌సంగించారు. నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం కొండపాకగూడెం గ్రామంలో ప్ర‌జాప్ర‌స్థానం పాద‌యాత్ర‌ను వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయ‌స్ ష‌ర్మిళ గారు తిరిగి ప్రారంభించారు. గతేడాది అక్టోబర్ 20వ తేదీన ఈ పాదయాత్ర ప్రారంభం కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, కొవిడ్ ఉధృతి కార‌ణంగా తాత్కాలికంగా వాయిదా ప‌డింది. 21రోజుల పాటు 247 కిలోమీట‌ర్ల‌కు పైగా పాద‌యాత్ర చేప‌ట్టారు.

 గ‌డ‌ప గ‌డ‌ప‌కూ ప‌ల‌క‌రింపు..ప్ర‌జాప్ర‌స్థానం పాద‌యాత్ర‌లో వైయ‌స్ ష‌ర్మిళ

గ‌డ‌ప గ‌డ‌ప‌కూ ప‌ల‌క‌రింపు..ప్ర‌జాప్ర‌స్థానం పాద‌యాత్ర‌లో వైయ‌స్ ష‌ర్మిళ

దివంగత సీఎం వైయ‌స్ఆర్ మ‌ర‌ణం తెలుగు ప్రజలకు తీర‌ని లోటన్నారు షర్మిళ. వైయ‌స్ఆర్ చ‌నిపోతే 700 మంది గుండెలు ఆగిపోయాయని, దీనిబ‌ట్టి వైయ‌స్ఆర్ ఎంత‌గొప్ప నాయ‌కుడో తెలుసుకోవ‌చ్చన్నారు షర్మిళ. వైయ‌స్ఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు 33 సార్లు న‌ల్ల‌గొండ జిల్లాకు వ‌చ్చారని, మ‌రి చంద్రశేఖర్ రావు ఎన్నిసార్లు వ‌చ్చారని షర్మిళ ప్రశ్నించారు. కేవ‌లం ఉప ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డానికి వ‌స్తున్నాడు త‌ప్ప ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఏనాడూ రాలేదని ఎద్దేవా చేసారు. వైయ‌స్ఆర్ ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాను స‌స్య‌శ్యామ‌లం చేయాల‌ని ఎస్ఎల్బీసీ ద్వారా ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీళ్లు ఇవ్వాల‌నుకున్నారని, సొరంగ మార్గం ద్వారా పైప్ లైన్ వేసి, ఫ్లోరైడ్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని అనుకున్నారని షర్మిళ గుర్తు చేసారు.

 క‌మీష‌న్ల కోస‌మే అప్పులు చేసి, కాళేశ్వ‌రం క‌ట్టిండు.. మండి పడ్డ షర్మిళ

క‌మీష‌న్ల కోస‌మే అప్పులు చేసి, కాళేశ్వ‌రం క‌ట్టిండు.. మండి పడ్డ షర్మిళ

చంద్రశేఖర్ రావు సైతం వైయ‌స్ఆర్ ప్రాజెక్టుల‌ను ప‌ట్టించుకోలేదని, రాజ‌శేఖ‌ర రెడ్డి బ‌తికే ఉంటే ఎస్ఎల్ బీసీ పూర్తై ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీళ్లు అందేవన్నారు షర్మిళ. ఉద‌య స‌ముద్రం ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేసింది వైయ‌స్ఆర్ అని, చంద్రశేఖర్ రావు రాష్ట్ర ఖ‌జానానంత‌టినీ కాళేశ్వ‌రం మీదే కుమ్మరించి క‌మీష‌న్లు దోచుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వ‌రం ద్వారా న‌ల్ల‌గొండ జిల్లాలో ఒక్క ఎక‌రం కూడా పార‌లేదని, వైయ‌స్ఆర్ హాయంలోనే మ‌హాత్మాగాంధీ యూనివ‌ర్సీటీ, నిమ్స్ ఆసుప‌త్రి, నాగార్జున సాగ‌ర్ ఆధునీకీక‌ర‌ణ ప‌నులు జ‌రిగాయని, మ‌రి చంద్రశేఖర్ రావు న‌ల్ల‌గొండ జిల్లాకు ఏం చేశారని షర్మిళ సూటిగా ప్రశ్నించారు.

 ప్ర‌తి ఇంటికీ, పొలానికి నీళ్లు ఇచ్చింది వైయ‌స్ఆర్.. గుర్తు చేసిన విజయమ్మ

ప్ర‌తి ఇంటికీ, పొలానికి నీళ్లు ఇచ్చింది వైయ‌స్ఆర్.. గుర్తు చేసిన విజయమ్మ

ప్రాణ‌హిత- చేవెళ్ల వైయ‌స్ఆర్ మాన‌స పుత్రిక‌ అని, ఆ ప్రాజెక్టును నిర్మించి, తెలంగాణ‌ను స‌స్య‌శ్యామ‌లం చేయాల‌ని వైయస్సారు ఎన్నో క‌ల‌లు క‌న్నారని వైయస్ విజ‌య‌మ్మ, అభిప్రాయ పడ్డారు. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో నీటి కొర‌త లేకుండా చేయాల‌ని వైయ‌స్ రాజ‌శేఖ‌ర రెడ్డి అనేక ప్రాజెక్టులు చేప‌ట్టారని, కోయిల్ సాగ‌ర్, నెట్టంపాడు, బీమా, నాగార్జునసాగ‌ర్ కాలువ‌ల ఆధునీకీక‌ర‌ణ‌, క‌ల్వ‌కుర్తి, దేవాదుల‌, దుమ్ముగూడెం, ఎస్ఎల్బీసీ త‌దిత‌ర ప్రాజెక్టులు నిర్మించారన్నారు విజయమ్మ. దండుగ అన్న వ్య‌వ‌సాయాన్ని పండుగ చేశారని, రైతును రాజు చేశారని, నేటి పాల‌కులు వైయ‌స్ఆర్ నిర్మించిన ప్రాజెక్టుల‌కే పైపులైన్లు పెట్టి, కుళాయిలు బిగించి దానికి మిష‌న్ భ‌గీర‌థ పేరు పెట్టి నీళ్లు ఇచ్చాం అని చెబుతున్నారని, వాస్త‌వానికి ప్ర‌తి ఇంటికీ నీళ్లు ఇచ్చింది, ప్ర‌తి పొలానికి నీళ్లు ఇచ్చింది వైయ‌స్ఆర్ అని విజయమ్మ గుర్తు చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+