Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేవంత్ నివాసానికి డీజీపీ, "హోదా" వచ్చేసింది - హైకమాండ్ భారీ గిఫ్ట్..!!

రేవంత్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణతో పాటుగా దేశ వ్యాప్తంగా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. మూడు రాష్ట్రాల్లో ఓడిన కాంగ్రెస్ ను ..తెలంగాణలో గెలవటం వెనుక ప్రధానంగా నిలిచింది..వినిపిస్తోంది రేవంత్ పేరు. కర్ణాటక ఎన్నికలు పూర్తవుతూనే తెలంగాణ పైన కాంగ్రెస్ పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. కాంగ్రెస్ గెలుపు ఖాయం కావటంతో రేవంత్ తో డీజీపీ అంజనీ కుమార్ సమావేశమయ్యారు. అభినందనలు తెలిపారు. దీంతో రేవంత్ కే సీఎం పదవి దక్కుతుందనే అంచనాలు పెరిగాయి.

రేవంత్ మేనియా : తెలంగాణలో ఇప్పుడు రేవంత్ మేనియా కొనసాగుతోంది. టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సమయంలో సీనియర్ల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న రేవంత్ ఇప్పుడు హీరోగా మారారు. కాంగ్రెస్ గెలుపు వెనుక రేవంత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రేవంత్ కు సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది.

DGP Anjani Kumar Reaches REvanth House, Amid Congress wins power in the State

రేవంత్ నివాసం కేంద్రంగా కాంగ్రెస్ సంబరాలు మొదలయ్యాయి. సీనిమయర్లు రేవంత్ కు మద్దతుగా కదలివస్తున్నారు. ఈ ఎన్నికల్లో రేవంత్ ప్రధానంగా కేసీఆర్ ను టార్గెట్ చేసారు. పొత్తుల విషయంలోనూ షర్మిల తో సహా ఎవరితోనూ హైకమాండ్ ముందుకు వెళ్లకుండా నివారించటంలో సక్సెస్ అయ్యారు. అభ్యర్దుల విషయంలో తన అభిప్రాయాలు స్పష్టం చేసారు. హైకమాండ్ సైతం అధిక శాతం రేవంత్ సూచించిన వారికే సీట్లు కేటాయించింది.

రేవంత్ వైపే అందరి చూపు : తొలి నుంచి బీఆర్ఎస్ ఓటమి ఖాయమంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో అంచనాలు పెంచారు. కేసీఆర్ పైన అగ్రెసివ్ గా పోరాటం చేస్తూ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపారు. పార్టీ సీనియర్లతో సమస్యలు వచ్చినా హైకమాండ్ కే బాధ్యతలు వదిలేసారు. ప్రతీ నియోజకవర్గంలోనూ క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితుల పైన పూర్తి సమాచారంతో వ్యూహాత్మకంగా అడుగులు వేసారు.

బీఆర్ఎస్ 25 సీట్లు దాటదంటూ పాజిటివ్ టాక్ ఎన్నికల ముందే తీసుకురావటంలో సక్సెస్ అయ్యారు. ప్రజలంతా కాంగ్రెస్ కే ఓటు వేస్తున్నారనే బలమైన అభిప్రాయం అందరిలోనూ కలిగించటంలో సఫలమయ్యారు. ఇక, పార్టీ అగ్రనాయకత్వం తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని వారికి మరింత దగ్గరయ్యారు. ఏ నియోజకవర్గాల్లో అగ్రనాయకత్వం ప్రచారం చేయాలో సూచించి అక్కడ పార్టీ గెలుపుకు కారణమయ్యారు.

సీఎంగా ఛాన్స్ దక్కేనా : ఇప్పుడు నేరుగా డీజీపీ వచ్చి రేవంత్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. కాబోయే సీఎంగా అవకాశం ఉండటంతో మర్యాద పూర్వకంగా కలిసారు. దీంతో.. ఇప్పుడు రేవంత్ కు సీఎం సీటు దక్కుతుందా లేదా అనేదే ఆసక్తి కరంగా మారుతోంది. త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉండటంతో కాంగ్రెస్ ఆచి తూచి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

సామాజిక సమీకరణాలను ప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నారు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటులో చోటు చేసుకున్న పరిణామాలతో కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తం అవుతోంది. ఇప్పటికే పార్టీ నాయకత్వం హైదరాబాద్ లో మొహరించింది. ఒకటి రెండు రోజుల్లోనే కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలతో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి..సీఎం అభ్యర్ది ఎంపిక నిర్ణయం హైకమాండ్ కు అప్పగిస్తూ తీర్మానం చేయనున్నారు. హైకమాండ్ ఎవరికి సీఎం పదవి కేటాయిస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠ పెంచుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+