బంగాళాఖాతంలో ధరణి.. తెలంగాణాలో ఇకపై భూ భారతి.. మంత్రి పొంగులేటి కీలకప్రకటన!

తెలంగాణా అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భేషజాలకు పోయి ధరణిని రద్దు చేయటం లేదని, ప్రజా సమస్యల పరిష్కారానికే ధరణి పోర్టల్ రద్దు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగింది.

తెలంగాణ భూ భారతి బిల్లు 2024ను సభలో ప్రవేశపెట్టిన మంత్రి
ఆ తర్వాత ప్రభుత్వం సభలో రెండు కీలక బిల్లులు... తెలంగాణ జీతాలు, ఫించన్ చెల్లింపు అనర్హతల తొలగింపు బిల్లు 2024ను శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశ పెట్టగా..., తెలంగాణ భూ భారతి బిల్లు 2024ను రెవిన్యూ, గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశ పెట్టారు.

dharani portal cancelled and bhu bharathi bill presented in telangana assembly minister ponguleti key comments

ధరణితో సమస్యలు, కోర్టుల్లో భూ వివాదాలు
ఈ సందర్బంగామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ భూ భారతి బిల్లుపై సభలో వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ధరణితో ఎన్నో సమస్యలు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ అధికారుల దగ్గర పరిష్కారం కావలసినవి కూడా కోర్టులకు చేరాయనీ చెప్పారు. ధరణి కారణంగా భూములు ఉన్న రైతులు, లక్షలాది మంది ఎంతో ఇబ్బంది పడ్డారన్నారు. భూ యజమానికి తెలియకుండానే భూమి చేయి దాటిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి అన్నారు.

కొత్తగా భూభారతి చట్టాన్ని తెస్తున్నాం
అందుకే సమస్యలు అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని లోపభూయిష్టమైన ఆర్వోఆర్ చట్టం-2020ను కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు.కొత్తగా భూభారతి చట్టాన్ని తెస్తున్నాం అని మంత్రి పేర్కొన్నారు . పలు రాష్ట్రాల్లోఆర్వోఆర్ చట్టాలను పరిశీలించి ఈ చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ధరణి కారణంగా నాలుగు నెలలు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయనీ, 2 నెలలు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయనీ అప్పటి పరిస్థితులను మంత్రి సభలో పేర్కొన్నారు.

అన్న మాట మేరకే ధరణి బంగాళాఖాతంలో
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చామని అప్పట్లో చెప్పుకున్నారు అని...తమపై విమర్శలు గుప్పించారు అని గుర్తు చేశారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ఎన్నికల సమయంలో చెప్పామని, ఆ మాట ప్రకారమే ధరణిని బంగాళా ఖాతంలో కలిపి... తెలంగాణా భూ భారతిని తీసుకొచ్చాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

ఆ భూములు వెనక్కు.. మళ్ళీ పేదలకు భూములు
మనషులకు ఆధార్ ఎలాగో, భూములకు భూదార్ అలా ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయంలో ధరణి పేరతో పేదల భూములు దోచుకున్నారని, కొత్త చట్టం అమల్లోకి వచ్చాక ఆ భూములను వెనక్కి తీసుకుంటామన్నారు. వాటిని భూములు లేని నిరుపేదలకు ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

భూ భారతి బిల్లుపై మాట్లాడటానికి సమయం కావాలన్న హరీష్ రావు, ఓవైసీ
ఇదిలా ఉంటే సభలో తెలంగాణ భూ భారతి బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో బిల్లుపై మాట్లాడటానికి తమకు సమయం కావాలని...భూభారతి బిల్లు మా చేతికి రాకముందే చర్చ అంటే ఎలా అని మాజీ మంత్రి హరీష్ రావు, శాసన సభ్యులు అక్బరుద్దీన్ ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+