లెక్కల వెనుక రేవంత్ మాజీ గురువు - సభలో హరీష్ వర్సస్ కాంగ్రెస్..!!
తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి ,హరీష్‌రావు డైలాగ్ వార్ నడిచింది. కాళేశ్వరంపై వెంటనే సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుందని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. కొత్త సీఎంకు విషయం అర్థం కావడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఆర్దిక పరిస్థితి లెక్కల వెనుక సీఎం రేవంత్ మాజీ గురువు ఉన్నారని హరీష్ ఆరోపించారు. సీఎం రేవంత్ సీరియస్ గా స్పందించారు.
డైలాగ్ వార్ : తెలంగాణ అసెంబ్లీ వాడీవేడీ చర్చ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ పాలన, కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కూడా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారెంటీల అమలును ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాల పేరుతో దగా చేస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాత గురువు శిష్యులు ఈ శ్వేతపత్రం స్టోరీ వండి వార్చారని హరీశ్‌రావు మండిపడ్డారు. ఏపీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ శ్వేతపత్రం తయారీ వెనుక ఉన్నారన్నారు.దీనికి మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం చెప్పగా అవసరమైతే తయారు చేసిన వాళ్ల పేర్లు కూడా చెప్తామని హరీశ్‌రావు బదులిచ్చారు.

హరీష్ వర్సస్ రేవంత్ : శ్వేతపత్రంలో కేవలం అప్పులు చూపించి ఆదాయం ఎలా పెరిగిందో చెప్పకపోవడం సరికాదని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వమే తప్పుడు ప్రచారం చేస్తే పెట్టుబడులు ఆగిపోయి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. కరోనా, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల తెలంగాణకు లక్ష కోట్ల రుణ భారం అదనంగా పడిందని చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్ కింద తీసుకున్న అప్పు కేవలం కాళేశ్వరం కోసమే ఖర్చు చేయలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు కూడా ఖర్చు చేశామన్నారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ ఘాటుగా స్పందించారు. 2014నుంచి 16వరకు హరీష్ రావు నీటిపారుదుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కేసీఆర్ చేశారు. నీటిపారుదల శాఖ మంత్రిగా తొమ్మిదిన్నర ఏళ్ళు వారి కుటుంబం తప్ప మరెవరు చేయలేదని చెప్పుకొచ్చారు.

కాళేశ్వరం నిధులపై : కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 వేల కోట్లు కాదన్నారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్‌కు రూ.97,449 కోట్లు. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఖర్చు చేసిందని వివరించారు. హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పుకొచ్చారు. 2014కు ముందు ప్రజలు మంచినీరు తాగలేదా? బీఆర్‌ఎస్ వచ్చాకనే మంచినీళ్లు తాగినట్లు చెబుతున్నారని మండిపడ్డారు. మిషన్ భగీరథ వల్ల ఐదు వేల కోట్ల ఆదాయం వస్తుందని మభ్యపెట్టి లోన్లు తెచ్చారన్నారు. అప్పులు చేసిన విషయాన్ని అంగీకరించకుండా దబాయిస్తున్నారని వివరించారు. అత్యధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కూపంగా మార్చారని కాగ్ చెప్పిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications