అయ్యో రామా.. ఎంత పని జరిగింది.. పార్టీ కోసం కోమటిరెడ్డి ఆస్తులు అమ్ముకున్నారంట?
మనం ఏదైనా ఒక ప్రకటన చేసే ముందు అందులో ఎంత వాస్తవం ఉందో ఒకసారి పరిశీలించుకోవాలి. నలుగురు నమ్మేలా ఉండాలి. అలా కాకుండా నేను రాజకీయ నేతను కదా.. నా ప్రజలు ఏది చెప్పినా నమ్ముతారంటూ ఏది పడితే అది చెబితే ఏమవుతుందంటే.. అందరిలో నవ్వులపాలవ్వాల్సి వస్తుంది. సరిగ్గా ఇది కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నారంట. మధ్యలో భారతీయ జనతాపార్టీకి వెళ్లి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసిన నాయకుడు నిజంగా ఆస్తులు అమ్ముకునేవాడైతే అసలు వేరే పార్టీలోకి వెళ్లేవాడు కదా అంటున్నారు.
అందరూ నవ్వుకుంటున్నారు
కాంగ్రెస్ పార్టీ కోసం తాను సర్వం త్యాగం చేశానని, కానీ తనను పట్టిచుకోవడంలేదంటూ వాపోయారు. దీంతో రాష్ట్రంలోని ఇతర కాంగ్రెస్ నేతలు కూడా నిజమే కాబోలు అనుకుంటూ నవ్వుకుంటున్నారు. ఆస్తులు అమ్ముకోవడానికి బదులుగా కాంగ్రెస్ పార్టీని చచ్చిపోయేలా చేయడానికి, కాంట్రాక్టులు దక్కించుకోవడానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇబ్బందులు పెట్టడానికి మాత్రం బాగా పనిచేశారు. వాస్తవానికి ఎన్నికలకు సంవత్సరం ముందు బీజేపీలో చేరి కాంగ్రెస్ ను దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది. అదే మునుగోడు ఉప ఎన్నిక. కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి కూడా కాపాడలేరు అని చెప్పేందుకే ఆయన ఆ ఎన్నిక ద్వారా ప్రయత్నం చేశారు.

కాంగ్రెస్ పెట్టిన భిక్ష వల్లే కోటీశ్వరులయ్యారు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెరవెనక కోమటిరెడ్డ వెంకటరెడ్డి ఎంత సహకారం అందించారో అందరికీ తెలుసని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ ఎన్నికలోనే కాంగ్రెస్ పార్టీ గెలవదంటూ కాంగ్రెస్ లోనే ఉండి వెంకటరెడ్డి మాట్లాడారు. ఇటువంటి నాయకుడుఇప్పుడు మంత్రి అయ్యాడు అంటే కేవలం రేవంత్ రెడ్డి పుణ్యమా అని. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చినప్పుడు సభలకు డబ్బులు ఖర్చుపెట్టడానికి కూడా ముందుకు రాలేదు. కాంగ్రెస్ పార్టీ ద్వారా కాంట్రాక్టులు దక్కించుకొని, దండిగా డబ్బులు సంపాదించుకొని కుబేరులుగా చెలామణి అవుతున్న కోమటిరెడ్డి సోదరులకు అదంతా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అని గుర్తుంచుకుంటే చాలని పార్టీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications