Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విచిత్ర జుట్టు, రెడ్ కలర్ చెప్పులు : బాలాపూర్ బాలుడి కేసును చేధించిన పోలీసులు

హైదరాబాద్ : రోడ్లపై మహిళలు, యువతులే కాదు .. చిన్నారులు ఒంటరిగా వెళ్లాలంటే వణికే పరిస్థితి. కొందరు మృగాళ్లకు ... వావి, వరసే కాదు చిన్న, పెద్ద అనే తేడా కూడా తెలియదు. తమలోని రాక్షసుడు నిద్రలేస్తే చాలు .. చిన్నారులపై ఆకృత్యాలకు ఒడిగడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ ఏడేళ్ల బాలుడిపై మానవరూపంలో ఉన్న మృగం లైంగికదాడికి ఒడిగట్టింది. అయితే ఇంతలో బాలుడి అరుపులు .. ఓ మహిళ రావడంతో ఎక్కడ దొరికిపోతాననే చిన్నారిని మట్టుబెట్టాడు. కానీ పోలీసుల విచారణలో ఆ యువకుడు దొరికిపోయాడు.

బయటకు రావడమే పాపమా ?

బయటకు రావడమే పాపమా ?

ఈ నెల 8న బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలుడు కూల్ డ్రింక్ కోసం బయటకొచ్చాడు. తమ జల్ పల్లి వాది ఎ ముస్తఫా కాలనీలోని కిరణానికి వెళ్లాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఒమర్ బిన్ హసన్ ఎక్కడికి వెళ్తున్నావని అడిగాడు. కూల్ డ్రింక్ అని చెప్పగా మరో షాపులో కొనిస్తానని చెప్పాడు. నిజమేనని నమ్మి వెళ్లటమే పాపమైంది. సమీపంలో ఉన్న పాడుబడ్డ గ‌ృహలోకి తీసుుకెళ్లి ఆకృత్యానికి ఒడిగట్టాడు. భయంతో బాలుడు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న మహిళ అటుగా వచ్చింది. అతడు ఉన్నచోటికి వెళ్తుండగా .. ఎక్కడ దొరికిపోతానని భయపడ్డాడు. బాలుడి తలను బండరాయికేసి బలంగా కొట్టడంతో అక్కడిక్కడే చనిపోయాడు.

పట్టించిన జుట్టు, చెప్పులు

పట్టించిన జుట్టు, చెప్పులు

బాలుడి పేరెంట్స్ ఫిర్యాదు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. హైదరాబాద్ దక్షిణ మండలం, టాస్క్ ఫోర్స్ పోలీసులు, బాలాపూర్ పోలీసులు రంగంలోకి దిగి ఎంక్వైరీ చేశారు. కానీ కేసు చేధన వారి కష్టంగా మారింది. బాలుడి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలను నిశీతంగా పరిశీలించారు. ఘన జరిగాక భయంతో పారిపోతున్న యువకుడి సమీపంలోని సీసీ కెమెరాకు చిక్కాడు. ఆ ప్రాంతానికి 200 మీటర్ల దూరంలో విజువల్స్ కనిపించడం ... ఘటన జరిగిన కొద్దిసేపటికే చెప్పులతో పారిపోతుండటంతో ఆ యువకుడు అఘాయిత్యం చేశారా అని పోలీసులు అనుమానించారు. వీడియోలో విజువల్స్ క్లారిటీ లేకపోవడంతో దర్యాప్తుకు కొంచెం ఆటంకం కలిగింది. అనుమానితుడి వీపు భాగం మాత్రమే సీసీ కెమెరాలో రికార్డవడంతో అతని వెంట్రుకలే కేసు దర్యాప్తుకు పురోగతి కలిగించింది. చేతిలో రెడ్ కలర్ చెప్పులు కనిపించాయి. దీంతో ఎంక్వైరీ మరింత ముందుకుసాగింది.

అదే పోలికలు

అదే పోలికలు

దీనికితోడు నిందితుడు ఆకాంర తెలిసిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. హసన్ అనే వ్యక్తి అదే పోలికలతో ఉన్నట్టు చెప్పడంతో పోలీసులు మరింత లోతుగా ఆరాతీశారు. ఘటన జరిగిన తర్వాత హసన్‌ ఇంటికి రాకపోవడంతోపాటు అతడు రెడ్ కలర్ చెప్పులే ధరిస్తుండటం.. దురాగతానికి పాల్పడిన రోజు సీసీ కెమెరాల్లో కనిపించిన దుస్తులే వేసుకున్నట్లు నిర్ధారణ కావడంతో చిక్కుముడి వీడింది. అతడి కోసం నిఘా పెట్టి ... పక్కా ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+