లాక్ డౌన్ : మోదీతో తెలుగు సీఎంల భిన్నాభిప్రాయాలు.. 'హెలిక్యాప్టర్ మనీ' ప్రతిపాదించిన కేసీఆర్

లాక్ డౌన్ పొడగింపుపై ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నాభిప్రాయాలు వినిపించారు. మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడగించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానితో చెప్పగా.. లాక్ డౌన్‌ను కేవలం రెడ్ జోన్లకే పరిమితం చేసి సడలించే దిశగా ఆలోచించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే,పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సైతం లాక్ డౌన్‌ను పొడగించాలని కోరడం గమనార్హం.

జగన్ ఏం మాట్లాడారు...

జగన్ ఏం మాట్లాడారు...

ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ పలు కీలక ప్రతిపాదనలు చేశారు. లాక్ డౌన్‌ను రెడ్ జోన్లకే పరిమితం చేసి.. జనం గుమిగూడేందుకు ఎక్కువ అవకాశం ఉండే మాల్స్‌, సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాలను మరికొన్ని రోజులు మూసివేయాలని సూచించారు. ఏపీ జీఎస్‌డీపీలో 35శాతం, ఉపాధి కల్పనలో 62శాతం వ్యవసాయ రంగానిదేనని గుర్తుచేశారు. అయితే లాక్ డౌన్ కారణంగా వ్యవసాయ రంగం తీవ్రంగా ప్రభావితమవుతోందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా పడిపోయిందని.. వాటిని నిల్వ చేసేందుకు సరిపడా గోదాములు కూడా లేవని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే లక్షలాది కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు.

రెడ్ జోన్లకే పరిమితం చేయాలని..

రెడ్ జోన్లకే పరిమితం చేయాలని..

కరోనా నియంత్రణ కోసం ప్రధానిగా మీరు తీసుకుంటున్న చర్యలను సమర్థిస్తున్నానని.. అయితే ఆర్థిక చక్రం కూడా ముందుకు కదలాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజల కనీస అవసరాలు తీర్చే విధంగా ఆర్థిక వ్యవస్థ ఉండాలని చెప్పారు. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రానికి ఆదాయం కూడా రాని పరిస్థితి నెలకొందన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడిందన్నారు. కరోనా నియంత్రణలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు.141 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను హాట్‌స్పాట్లుగా గుర్తించామన్నారు. ఏపీలో మొత్తం 676 మండలాలు ఉండగా.. 81 మండలాలు రెడ్‌జోన్, ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయన్నారు. మిగిలిన 595 మండలాలు గ్రీన్ జోన్‌లో ఉన్నాయని.. వాటిపై కరోనా ప్రభావం లేదని చెప్పారు. కాబట్టి కరోనా లాక్ డౌన్‌ను రెడ్ జోన్లకే పరిమితం చేయాలని తాను భావిస్తున్నట్టు ప్రధానితో చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్‌ను మరో రెండు వారాలు పొడగించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణకు లాక్ డౌన్ చాలా ఉపయోగపడుతోందన్నారు. మనకు లాక్ డౌన్‌ను మించిన ఆయుధం లేదని... కాబట్టి కొనసాగించడమే ఉత్తమమని అభిప్రాయపడ్డారు. కరోనాపై పోరులో దేశం ఏకతాటి పైకి వచ్చిందని.. ఇదే స్పూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేంద్రం నుంచి అందుతున్న సహాయ సహకారాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 6849 కేంద్రాల్లో పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ధాన్యం కొనుగోలుకు రూ.35వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు చెల్లించే అప్పుల కిస్తీలను మరో 6 నెలలు వాయిదా వేయాలని కోరారు. లాక్ డౌన్ అమలు వ్యూహం కోసం ప్రధాని అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు.

కేసీఆర్ చేసిన సూచనలేంటి...

కేసీఆర్ చేసిన సూచనలేంటి...

వ్యవసాయాన్ని నరేగాతో అనుసంధానం చేయాల్సిన అవసరముందన్నారు కేసీఆర్. కనీసం 2 నెలలైనా ఈ విధానం అమలుచేయాలన్నారు. దీని ప్రకారం రైతులు సగం కూలీ డబ్బులు భరిస్తే, మిగతావి నరేగా నిధుల నుంచి చెల్లించే విధానం తీసుకురావాలని సూచించారు. అలాగే గోదాముల్లో ధాన్యం నిల్వ చేయాలంటే ఇప్పుడున్న నిల్వలను ఖాళీ చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రజలకు 3 నెలలకు అవసరమైన ఆహార ధాన్యాలు ముందుగానే ఇస్తే ఎఫ్‌సీఐ గోదాముల్లో ఖాళీ ఉంటుందన్నారు. ఎఫ్‌సీఐ నుంచి డబ్బులు రావడానికి 4,5 నెలల సమయం పడుతుందని.. అప్పటివరకు బ్యాంకుల నుంచి బకాయిల ఒత్తిడి లేకుండా చూడాలని కోరారు.

Recommended Video

    Police Helping A Poor Old Man's Family, Emotional Video
    హెలిక్యాప్టర్ మనీ విధానాన్ని ప్రతిపాదించిన కేసీఆర్..

    హెలిక్యాప్టర్ మనీ విధానాన్ని ప్రతిపాదించిన కేసీఆర్..


    దేశం తీవ్ర ఆర్థిక మాంద్యాన్ని చవిచూసే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నందున.. వ్యూహాత్మక ఆర్థిక విధానం అవసరమని కేసీఆర్ చెప్పారు. ఆర్బీఐ క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానం అనుసరించాలని సూచించారు. హెలిక్యాప్టర్ మనీగా పిలిచే ఈ విధానం ద్వారా రాష్ట్రాలకు నిధులు సమకూర్చే సంస్థలకు వెసులుబాటు కలుగుతుందన్నారు. జీఎస్డీపీలో 5శాతం నిధులను క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానం ద్వారా విడుదల చేయాలన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+