వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ లో కోమ‌టిరెడ్డి వెంక‌టరెడ్డికి కష్టమే.. ఆయన బీజేపీలో చేరే ఛాన్స్; బిగ్ డిబేట్!!

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే, కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగులుతుంది అన్న చర్చ నల్గొండ జిల్లాలో ఆసక్తికరంగా మారింది. తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ లో రేగిన అంతర్గత దుమారం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్టీకి దూరమవుతారు అన్న చర్చకు కారణంగా మారింది.

రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ లో చిచ్చు

రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ లో చిచ్చు


ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో నష్టం జరగగా, మళ్లీ పార్టీని బలోపేతం చేయాలని, వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి పై రేవంత్ రెడ్డి విసుర్లు, తర్వాత రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసి రాజగోపాల్ రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలు, ఆపై రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ కోమటిరెడ్డి ఫ్యామిలీ పై రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు వెరసి ఆసక్తికర రాజకీయం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజుకుంది.

కోమటిరెడ్డి ఫ్యామిలీపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రచ్చ

కోమటిరెడ్డి ఫ్యామిలీపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రచ్చ

రాజగోపాల్ రెడ్డి రాజీనామా తరువాత మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికకు స్ట్రాటజీ మరియు ప్రచార కమిటీని వేసిన కాంగ్రెస్ పార్టీ, ఆ కమిటీలో భువనగిరి ఎంపీ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి స్థానం కల్పించలేదు. ఇక తాజాగా రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని కాకుండా, కోమటిరెడ్డి కుటుంబం బ్రాందీ షాపులు పెట్టుకునేవాళ్ళు అంటూ కామెంట్ చేయడంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా హర్ట్ అయ్యారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ లో ఇబ్బంది పడుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ లో ఇబ్బంది పడుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అనవసరంగా తనను రెచ్చగొట్టొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయం లో రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో పని చేయటం మొదలు పెట్టే సమయానికి రేవంత్ రెడ్డి పుట్టి ఉండడు అంటూ వ్యాఖ్యానించారు. రాజగోపాల్ రెడ్డి చిన్న పిల్లోడు కాదని, తన వ్యవహారంపై తాను మాట్లాడానని తేల్చి చెప్పారు. తాజా పరిణామాలతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందికర పరిణామాలకు ఎదుర్కొంటున్నారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా రాజీనామా చేస్తారా? నల్గొండ జిల్లాలో టాక్

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా రాజీనామా చేస్తారా? నల్గొండ జిల్లాలో టాక్


ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి తీరు నచ్చకనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఇక ప్రస్తుతం తాజాగా జరుగుతున్న పరిణామాలలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ రెడ్డి తీరుతో తీవ్ర మనస్థాపానికి గురి అవుతున్నారు. ఈ క్రమంలో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తారు అన్న చర్చ నల్గొండ జిల్లాలో ఆసక్తికరంగా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మూడు నియోజకవర్గాల్లో నష్టం జరుగుతుందని అంచనా. ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా చేస్తే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఆరు నియోజకవర్గాల్లో నష్టం జరిగే అవకాశం ఉంది.

కోమటిరెడ్డి బ్రదర్స్ ఆప్షన్ బీజేపీనే ... ఆసక్తికర చర్చ

కోమటిరెడ్డి బ్రదర్స్ ఆప్షన్ బీజేపీనే ... ఆసక్తికర చర్చ


ఏది ఏమైనా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇమడలేకనే ఇదంతా జరుగుతుంది అన్న చర్చ జోరుగా సాగుతోంది. వీరికి బీజేపీనే ఆప్షన్ అన్న చర్చ జరుగుతుంది. ఇక నల్గొండ జిల్లాలో సోదరుడు బాటలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బిజెపి తీర్థం పుచ్చుకుంటారు అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. మరి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది ఆసక్తికరంగా మారింది.

English summary
The debate that Komati Reddy Venkat Reddy will have difficulty in Congress With the latest developments, it is being discussed in Nalgonda district that he may resign from the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X