టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మార్పు అంశంపై దిగ్విజయ్ సింగ్ చెప్పిందిదే.. సీనియర్లు సర్దుకుంటారా?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి వచ్చి పార్టీ ముఖ్య నాయకులతో మంతనాలు జరిపిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మార్పు అంశం పై కీలక వ్యాఖ్యలు చేశారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మార్పు తన పరిధిలోని అంశం కాదని దిగ్విజయ్ సింగ్ తేల్చి చెప్పారు. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సర్దుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు . కాంగ్రెస్ నేతలంతా ప్రజల్లోకి వెళ్లాలని, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి అందరూ పని చేయాలని దిగ్విజయ్ సింగ్ సూచించారు.

రేవంత్ రెడ్డి మార్పు అంశంపై దిగ్విజయ్ సింగ్ చెప్పిందిదే
రేవంత్ రెడ్డి విషయంలో చోటుచేసుకున్న పంచాయతీని పరిష్కరించడం కోసం వచ్చిన దిగ్విజయ్ సింగ్ రేవంత్ రెడ్డి మార్పు విషయంలో తానేమీ చేయలేనని చేతులెత్తేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారని, వారంతా కలిసి పని చేయాలని దిగ్విజయ్ సింగ్ హితవు పలికారు. కలిసికట్టుగా ఉంటేనే ప్రత్యర్థిని ఓడించగలమని పేర్కొన్న దిగ్విజయ్ సింగ్ సమస్యలు ఏమి ఉన్నా అంతర్గతంగా నే పరిష్కరించుకోవాలి కానీ, రచ్చ చేసుకోవద్దని సూచించారు. పార్టీలో ఉన్న విభేదాలపై నేతలు బహిరంగంగా మాట్లాడొద్దని తెలిపారు.

పార్టీలో సీనియర్లు, జూనియర్లు ఏంటి?
తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ పార్టీ పై పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నేతలంతా సిద్ధం కావాలని దిగ్విజయ్ సింగ్ దిశానిర్దేశం చేశారు. సీనియారిటీ తో కాదు తమ తీరు వల్లే పార్టీ ముందుకు వెళుతుందని పేర్కొన్న ఆయన పరిస్థితులకు తగ్గట్టు మెదలాలి అని పార్టీ నేతలకు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, జూనియర్లు అన్న ప్రస్తావన సరికాదని పేర్కొన్న దిగ్విజయ్ సింగ్ సీనియర్ నేతలు సంయమనం పాటించాలని కోరారు.

తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ కాదా?
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారని, తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబ పాలన సాగుతోందని విమర్శించిన దిగ్విజయ్ సింగ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ నేతలు పోరాటం చేయాలన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కేసీఆర్ ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ మద్దతు లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అంటూ ఆయన ప్రశ్నించారు. 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని తాము ఇచ్చిన మాటకు కట్టుబడి 2014లో తాము తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తమ మాటను నెరవేర్చుకున్నామని, ఇద్దరు ఎంపీలు ఉన్న టిఆర్ఎస్ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా అంటూ ప్రశ్నించారు.

మోదీపాలనపై మండిపడిన దిగ్విజయ్ సింగ్
ఇక బిజెపి పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ సింగ్ మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేశంలో నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని, ఈ యాత్రను అడ్డుకోవడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు . మోడీ పాలనలో ఈ డి, ఐ టి, సి బి ఐ దాడులతో నిర్దోషులని వేధింపులకు గురి చేస్తున్నారని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.

బీఆర్ఎస్ మీద పోరాటానికి సిద్ధం కండి
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సంబంధాలను బయటపెట్టాలని డిమాండ్ చేసిన ఆయన, రెండు పార్టీలు గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారంటూ పేర్కొన్నారు. బీజేపీ పాలనలో పేదరికం పెరిగిపోతుందని, మోడీ విధానాల సంపన్నులకే ప్రయోజనాలు చేకూరుస్తున్నాయని, ప్రతిపక్ష పార్టీల నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించి బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్నారని దిగ్విజయ్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. బి ఆర్ ఎస్ మీద పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఇది అని దిగ్విజయ్ సింగ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఏది ఏమైనా టీపీసీసీ చీఫ్ విషయంలో దిగ్విజయ్ సింగ్ చెప్పిన మాటలకు సీనియర్లు సర్దుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి!












Click it and Unblock the Notifications