సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్-హరీష్ శంకర్ సంచలనం : అమ్ముకొని బతికేస్తున్నారు..!!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్‌లో తన స్పోర్ట్స్ బైక్ మీదనుంచి అదుపుతప్పి క్రింద పడటంతో ఆపస్మారక స్థితిలోకి వెళ్లారు. మాదాపూర్ లో మెడికోవర్ ఆస్పత్రిలో ఆయనకు ప్రాధమిక చికిత్స చేసిన తరువాత అపోలోకు తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతున్నారు. కాలర్ బోన్ ను ఫ్రాక్చర్ మినహా ఇతరత్రా సమస్యలు ఏవీ లేవని వైద్యులు నిర్ధారించారు. అన్ని రకాల పరీక్షలు చేసారు.

కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్
ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదని వైద్యులు స్పష్టం చేసారు. అయితే, కుడి కన్ను, ఛాతి, పొట్ట పైన మాత్రం గాయాలు అయినట్లుగా నిరధారించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాం చరణ్ తో పాటుగా పలువురు సెలబ్రెటీలు అపోలోకు వెళ్లి ఆయన్ను పరామర్శించారు. సాయి ధరమ్ తేజ్ రెండు రోజుల్లో తిరిగి మన ముందుకు వచ్చేస్తారంటూ చిరంజీవి ట్వీట్ చేసారు. ఇదే సమయంలో బైక్ రేసులు అంటూ కొందరూ...రేసులు వద్దని చెప్పానంటూ హీరో నరేశ్ వ్యాఖ్యలు చేయటం మెగా అభిమానులకు నచ్చటం లేదు.

నరేశ్ వ్యాఖ్యలు..ప్రచారం పైన ఆవేదన
ప్రమాదం జరిగి మెగా ఫ్యామిలీ బాధ పడుతున్న సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు సరి కాదంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. నరేశ్ చేసిన వ్యాఖ్యల పైన శ్రీకాంత్ సైతం స్పందించారు. ఇటువంటి వ్యాఖ్యలు ఈ సమయంలో సరి కాదని చెప్పుకొచ్చారు. అయితే, నరేశ్ తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. సాయి ధరమ్ తేజ్ ప్రమాదం- ఆరోగ్యం పైన అనేక రకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీని పైన బండ్ల గణేష్ సైతం రియాక్ట్ అయ్యారు. నరేశ్ వ్యాఖ్యల పైన బండ్ల గణేస్ సైతం సీరియస్ అయ్యారు.

హరీష్ శంకర్ ట్వీట్ వైరల్
ఇక, ఇప్పుడు తాజాగా ఈ విధమైన చర్చ సమయంలో దర్శకుడు హరీష్ శంకర్ తన సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. హట్సాఫ్ తమ్ముడు..హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్..నీ యాక్సిడెంట్ వంకతో .... తప్పుడు వార్తలు అమ్ముకొని ..తికేస్తున్న అందరు బాగుండాలి ..వాళ్లకు ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నాను అంటూ తన ట్వీట్‌లో పేర్కోన్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. మంచు లక్ష్మీ, శ్రీకాంత్, బండ్ల గణేష్ వంటి ప్రముఖులు కూడా సాయి తేజ్‌పై తప్పుడు ప్రచారాలు చేయోద్దని కోరారు.

నిర్లక్ష్యం కాదు స్కిడ్ కావటం వలనే
నిరక్ష్యం వలన జరిగిన ప్రమాదం కాదని, కేవలం ఇసుక వలన స్కిడ్ అయి కింద పడ్డారంటూ చెప్పుకొచ్చారు. అయితే, మెగా శిబిరం నుంచి ఈ వ్యవహారం మీద స్పందించేందుకు ఇప్పుడు సిద్దంగా లేదు. ముందుగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం పైనే ఫోకస్ పెట్టారు. ఆయన వేగంగా కోలకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. దీంతో...ఇప్పుడు ఈ రకమైన ప్రచారాలే ఇప్పుడు ప్రధాన చర్చగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications