హైదరాబాద్ కు 150 కి. మీ. దూరంలోనే..విజువల్ ట్రీట్.. ఎలా వెళ్లాలి..?
హైదరాబాద్ లో కాంక్రీట్ లైఫ్ కు అలవాటు పడిన ఉద్యోగులు, విద్యార్థులు, ఫ్యామిలీస్ కు అదిరిపోయే శుభవార్త. హైదరాబాద్ కు కేవలం 150 కి.మీ. దూరంలోనే ప్రపంచాన్ని మైమరిపించే అద్భుతమైన పర్యాటక ప్రాతం ఉందని మీకు తెలుసా..? చుట్టూ భీకరమైన అడవి.. పెద్ద పెద్ద కొండలు.. కొండల మధ్య వంపులు తిరుగుతూ నదీ ప్రవాహం. ఒక్కసారి విజిట్ చేస్తే మళ్లీ రావాలని అనిపించదు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాంతం.
ఈ పర్యాటక ప్రాంతాన్ని ఆక్టోపస్ వ్యూ పాయింట్ అంటారు. ఈ టూరిస్టు ప్లేస్ నల్లమల అడవుల్లో విస్తరించి ఉంది. శ్రీశైలం వెళ్తున్న దారిలో దోమలపెంట ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో ఈ వ్యూ పాయింట్ ఉంటుంది. లోతైన లోయలు, దట్టమైన అడవులు, కృష్ణ నది బ్యాక్ వాటర్స్ తో అద్భుతంగా అంతకుమించిన ఆహ్లాదకరంగా ఈ ప్రదేశం కనువిందు చేస్తుంది. కొన్నేళ్ల క్రితం ఈ ప్రదేశంలోకి పర్యటకులను అనుమతించేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు టూరిస్టులు ఎంచక్కా వెళ్లొచ్చు.

కృష్ణానది బ్యాక్ వాటర్ అలా కొండల నడుమ ఒంపులు తిరుగుతూ ప్రవహిస్తుంది కాబట్టి ఈ ప్రదేశాన్ని ఆక్టోపస్ వ్యూ పాయింట్ అంటారు. లోయలు, కొండలు మధ్య ఈ వ్యూ పాయింట్ అద్భుతంగా ఉంటుంది. శ్రీశైలం- హైదరాబాద్ హైవే లోని మన్ననూరు ప్రాంతానికి 42 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇక్కడే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కూడా ఉంటుంది. దోమలపెంట చెక్ పోస్ట్ నుంచి కేవలం 6 కి. మీ దూరంలోనే ఈ ప్రదేశం ఉంటుంది.












Click it and Unblock the Notifications