దిశా ఎన్‌కౌంటర్ విచారణ: పోలీసులకు టెన్షన్; ముగ్గురు మైనర్లు, సిర్పూర్కర్ కమీషన్ ముందు పోలీసుల తప్పుల చిట్టా!!

దేశవ్యాప్తంగా వెటర్నరీ డాక్టర్ దిశ పై నలుగురు నిందితులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత నలుగురు నిందితులను పట్టుకున్న పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ పేరుతో దిశా మృతదేహం లభించిన చోటికే తీసుకు వెళ్లి, తప్పించుకునే ప్రయత్నం చేశారన్న కారణంతో ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు అరెస్ట్ చేసిన వారు నిందితులా కాదా? వారు నేరం చేశారా లేదా? అనేది నిర్ధారణ కాకుండా పోలీసులు చేసిన ఎన్ కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ అని నిందితుల కుటుంబీకులు కోర్టును ఆశ్రయించడంతో, సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో సిర్పూర్కర్ కమీషన్ ను ఏర్పాటుచేసి ఎన్ కౌంటర్ పై నిజానిజాలు తేల్చాల్సిందిగా ఆదేశించింది.

దిశా నిందితుల ఎన్కౌంటర్ పై సిర్పూర్కర్ కమీషన్ విచారణ

దిశా నిందితుల ఎన్కౌంటర్ పై సిర్పూర్కర్ కమీషన్ విచారణ

ఈ ఏడాది ఆగస్టు-నవంబర్ మధ్య సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య ప్యానెల్ విచారణ సందర్భంగా 15 మంది పోలీసులతో సహా 54 మంది సాక్షులను విచారించగా ఎన్ కౌంటర్ కు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత వారం విచారణలు ముగిశాయి. ముఖ్యంగా ఎన్కౌంటర్ చేసిన పోలీసులను సిట్ దర్యాప్తు అధికారి గా ఉన్న డిసిపి నరేందర్ రెడ్డి ని, ఈ ఎన్ కౌంటర్ కి నాడు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్న సజ్జనార్ ను,15 మంది పోలీసులను విచారించిన సిర్పూర్కర్ కమిషన్ తమ ప్రశ్నలతో పోలీసులకు చెమటలు పట్టించిన విషయం తెలిసిందే.

ఎన్ కౌంటర్ మృతుల కుటుంబ సభ్యుల తరపు వాదనలు విన్నసిర్పూర్కర్ కమీషన్

ఎన్ కౌంటర్ మృతుల కుటుంబ సభ్యుల తరపు వాదనలు విన్నసిర్పూర్కర్ కమీషన్

పోలీసులు ఒకరికొకరు భిన్నమైన సమాధానాలు చెప్పడంతో వాటన్నింటినీ నమోదు చేసిన సిర్పూర్కర్ కమిషన్ దిశ ఎన్ కౌంటర్ పై ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళన పోలీసుల వ్యక్తమవుతున్న సమయంలో మృతుల కుటుంబ సభ్యుల తరుపున న్యాయవాదులు బూటకపు ఎన్కౌంటర్ అని నిరూపించడం కోసం తమ వద్ద ఉన్న ఆధారాలను కమీషన్ ముందుంచారు. దిశా నిందితుల ఎన్ కౌంటర్ కేసులో మంగళవారం నుంచి వాదనలు వింటున్న సిర్పూర్కర్ కమిషన్ ముందు హత్య కేసులో నిందితులైన జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు, ఆరిఫ్ ల కుటుంబ సభ్యుల తరఫున వాదనలు వినిపించారు పలువురు న్యాయవాదులు .

నిందితులలో ముగ్గురు మైనర్లు.. ఫేక్ ఎన్కౌంటర్

నిందితులలో ముగ్గురు మైనర్లు.. ఫేక్ ఎన్కౌంటర్

మృతుల కుటుంబ సభ్యుల తరఫున న్యాయవాది కె.వి కృష్ణమాచారి, సామాజిక కార్యకర్తలు సజయ, రజిని ఫిర్యాదు చేశారు. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని, నలుగురు నిందితులను పట్టుకున్న పోలీసులు వారిని కాల్చి చంపి కట్టు కథలు చెబుతున్నారని వారు కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారని, వారిని జువైనల్ కోర్టుకు పంపకుండా, వారి వయసును దాచిపెట్టి మరి మామూలు జైలుకు పంపారని కమిషన్ ముందు పేర్కొన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కు కూడా తప్పుడు రికార్డులు సమర్పించారని వారు ఆరోపించారు.

పోలీసులు చేసిన తప్పులను ఏకరువు పెట్టిన న్యాయవాదులు

పోలీసులు చేసిన తప్పులను ఏకరువు పెట్టిన న్యాయవాదులు

న్యాయవాది వసుధా నాగరాజు వాదనలు వినిపిస్తూ నిందితులను జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచాల్సి ఉండగా, అలా కాకుండా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు అని పేర్కొన్నారు. అక్కడ 15 రోజుల పాటు నిందితులకు రిమాండ్ విధించడం కూడా నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. తాము చేసిన తప్పులను సరిదిద్దుకోవడం కోసం పోలీసులు ఈ విధంగా తప్పుల మీద తప్పులు చేశారని వారి కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు.న్యాయవ్యవస్థను పోలీసులు చేతుల్లోకి తీసుకోవడం సరైంది కాదని కమిషన్ కు వివరించారు.

దిశా నిందితుల ఎన్కౌంటర్ లో కమీషన్ విచారణలో పోలీసుల మెడకు ఉచ్చు

దిశా నిందితుల ఎన్కౌంటర్ లో కమీషన్ విచారణలో పోలీసుల మెడకు ఉచ్చు

ఇప్పటివరకు పోలీసులు ఇచ్చిన వాంగ్మూలంలో పొంతన లేని సమాధానాలు చెప్పడం, దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించి సిర్పూర్కర్ కమిషన్ ముందు బాధితుల తరపు న్యాయవాదులు, పోలీసులు చేసిన తప్పులను ఏకరువు పెట్టడం వంటి అంశాలతో ఈ కేసులో పోలీసులు మెడకు ఉచ్చు బిగుస్తోంది అన్న ఆందోళన పోలీసు శాఖలో వ్యక్తమౌతుంది. ఫిబ్రవరి లోపు కమిషన్ విచారణ పూర్తి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో, దిశా నిందితుల ఎన్కౌంటర్ వ్యవహారం ఎలాంటి సంచలన నిర్ణయాలకు వేదికగా మారుతుందో అన్న చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+