మొంథా ఎఫెక్ట్.. తెలంగాణలో ఏ ఏ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు..!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. దీని ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా గత అర్ధరాత్రి మచిలీపట్నం -కాకినాడ ప్రాంతానికి సమీపంలో.. పశ్చిమగోదావరి జిల్లా అంతర్వేదిపాలెం వద్ద తుపాను తీరాన్ని దాటింది. దీంతో రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం ఈ మొంథా తుపాను ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణిస్తుంది. బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్‌ వద్ద మరింత బలహీన పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గంటకు 85 కి.మీ నుంచి 95 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు రాగల 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేశారు.

districts-lists-in-telangana-have-holidays-for-schools-due-to-montha-cyclone

అయితే ఇందులో భాగంగా.. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

రెడ్ అలర్ట్..

భద్రాద్రి, ఖమ్మం, ములుగు, నాగర్ కర్నూల్

ఆరెంజ్ అలర్ట్..

మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్

ఎల్లో అలర్ట్..

కుమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌

పాఠశాలలకు సెలవులు..

భారీ వర్షాల నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలానే మహబూబాబాద్ జిల్లాలో కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇక ఖమ్మం జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. అదేవిధంగా తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరోవైపు మొంథా తుపాను కారణంగా ఏపీలో విద్యా సంస్థలకు ప్రకటించిన సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. తొలుత ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు సెలవులను ప్రకటించింది. ఇప్పుడు తుఫాను తీరం దాటిన నేపధ్యంలో సెలవులను 31వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+