కాంగ్రెస్ లో చేరిక వార్తలపై జేజమ్మ డీకే అరుణ క్లారిటీ
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో బిజెపిని వీడి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వార్తలు జోరందుకున్నాయి. తాజాగా నల్గొండ జిల్లా సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చేసిన ప్రకటన తర్వాత, మరోమారు బిజెపిలో పలువురు సీనియర్ నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు అన్నది చర్చకు వచ్చింది.
ముఖ్యంగా ఇందులో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా ఉన్నట్టు, ఆమె త్వరలో బిజెపి నుండి కాంగ్రెస్ బాట పడుతున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. డీకే అరుణ గద్వాలలో బీజేపీ గుర్తు ప్రజల్లోకి వెళ్ళకపోవటంతో బాగా ఇబ్బంది పడుతున్నారని, ఆమె కాంగ్రెస్ లోకి మారితే గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే డీకే అరుణ పార్టీ మారాలని చూస్తున్నట్టు చెప్తున్నారు.

ఈ క్రమంలో గద్వాల జేజమ్మ డీకే అరుణ తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని డీకే అరుణ తేల్చి చెప్పారు. తనపై వస్తున్న వార్తలపై అసహనం వ్యక్తం చేసిన డీకే రుణ కావాలని తనపై పార్టీ మారుతున్నట్టు ఫేక్ ప్రచారం చేస్తున్నారని, అదంతా పూర్తిగా అవాస్తవమని డీకే అరుణ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని మైండ్ గేమ్ ఆడుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు. ఇది కావాలని కాంగ్రెస్ తనపై చేస్తున్న ప్రచారంగా ఆమె పేర్కొన్నారు. బిజెపి అధిష్టానం తనను గుర్తించి తనకు జాతీయ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చిందని, మోడీ నాయకత్వంలో పనిచేయడానికి తాను ఆసక్తితో ఉన్నానని డీకే అరుణ పేర్కొన్నారు.
మోడీ నాయకత్వంలో పనిచేసేందుకు అదృష్టం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోనని డీకే అరుణ తేల్చి చెప్పారు. మరి డీకే అరుణ తన పార్టీ మార్పు వార్తలపై క్లారిటీ ఇవ్వటంతో అయినా ఆమెపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పడుతుందో లేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications