వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ ఎంపీల తీరుపై డీకే అరుణ ధ్వజ

|
Google Oneindia TeluguNews

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి చేసిన రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ ఎంపీల తీరును బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తప్పుబట్టారు. ప్రజాస్వామ్యాన్ని టిఆర్ఎస్ పార్టీ ఖూనీ చేస్తుందని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీల తీరును ఖండించిన డీకే అరుణ

పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీల తీరును ఖండించిన డీకే అరుణ

బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సోమవారం నాడు పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ ఎంపీల తీరును ఖండిస్తున్నామని పేర్కొన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యంలో గత 70 ఏళ్లుగా రాష్ట్రపతి ప్రసంగించడం సాంప్రదాయంగా వస్తున్న ప్రక్రియ అని పేర్కొన్న డీకే అరుణ. 135 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు మనం ప్రతినిధులం అనే విషయాన్ని మరిచి నియంతృత్వ ఆలోచనతో టీఆర్ఎస్ ఎంపీలు ప్రవర్తించడం సిగ్గుచేటని, టీఆర్ఎస్ ఎంపీల తీరుపై మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎంపీల తీరు చూసి పెద్దలను గౌరవించే పద్ధతి ఇదేనా అని దేశమంతా ముక్కున వేలేసుకుందని డీకే అరుణ అభిప్రాయపడ్డారు.

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం వల్ల తెలంగాణకు వచ్చే ప్రయోజనం ఏమీలేదు

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం వల్ల తెలంగాణకు వచ్చే ప్రయోజనం ఏమీలేదు


సభా కార్యక్రమాలకు విఘాతం కలిగించడం దేశ ప్రగతికి విఘాతం కలిగించడమే అని డీకే అరుణ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం వల్ల తెలంగాణకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని టీఆర్ఎస్ ఎంపీలు గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో గతేడాది నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి స్పష్టంగా వివరించారని డీకే అరుణ పేర్కొన్నారు. కరోనా వైరస్ ని కట్టడి చేయడం కోసం ప్రపంచంలోనే వేగవంతమైన వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టి, దేశంలో 160 కోట్లకు పైగా వ్యాక్సిన్లను సమర్థవంతంగా ప్రజలకు అందించి, కోట్లాది మంది ప్రజల ప్రాణాలు కాపాడిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానిదేనని డి.కె.అరుణ చెప్పుకొచ్చారు.

కేంద్ర సమర్ధ పాలనపై డీకే అరుణ కితాబు

కేంద్ర సమర్ధ పాలనపై డీకే అరుణ కితాబు


వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా కోవిడ్ పై పోరాటంలో భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటారని డీకే అరుణ పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ విశ్వాస్ సబ్ కా ప్రయాస్ నినాదంతో ముందుకు వెళ్తూ దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తోందని డీకే అరుణ పేర్కొన్నారు. 64 వేల కోట్లతో ఆయుష్మాన్ భారత్ పథకం చేపట్టిందని డీకే అరుణ స్పష్టం చేశారు. ఎనిమిది వేల జన ఔషధీ కేంద్రాల ద్వారా తక్కువ ధరలకే మందులను అందజేస్తోందని డీకే అరుణ వెల్లడించారు.

ఇంటింటికీ తాగు నీరు,డ్వాక్రా మహిళల రుణాలు ... సంక్షేమంలో భారత్ ముందంజ

ఇంటింటికీ తాగు నీరు,డ్వాక్రా మహిళల రుణాలు ... సంక్షేమంలో భారత్ ముందంజ


2021 22 ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా సంఘాలకు 65 వేల కోట్ల రుణాలను మంజూరు చేసిందని డీకే అరుణ పేర్కొన్నారు. ఇంటింటికి తాగునీరు అందజేయాలనే ఉద్దేశంతో జల జీవన్ మిషన్ ను ప్రారంభించిందని డీకే అరుణ స్పష్టం చేశారు. అంతే కాదు దేశవ్యాప్తంగా ముద్ర రుణాలను అందిస్తోంది అని, ప్రపంచంలోనే తక్కువ ధరకు ఇంటర్నెట్ ను అందజేస్తున్న దేశంగా భారత్ నిలిచిందంటే ఆ ఘనత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానిదేనని డీకే అరుణ పేర్కొన్నారు.

కేంద్రం నిధులిస్తున్నా, అందిపుచ్చుకోవటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం

కేంద్రం నిధులిస్తున్నా, అందిపుచ్చుకోవటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం

ఇక ఇదే సమయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడిన డీకే అరుణ తెలంగాణ అభివృద్ధి కోసం, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర నిధులు కేటాయిస్తూ ఉంటే, వాటిని అందిపుచ్చుకోవడంలో మాత్రం టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు చేరవేయడంలో సహకరించాలని డీకే అరుణ కోరారు. ఇక కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ నేతల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.

 దెయ్యాలు వేదాలు వల్లించినట్టు టీఆర్ఎస్ నేతల మాటలు

దెయ్యాలు వేదాలు వల్లించినట్టు టీఆర్ఎస్ నేతల మాటలు


టిఆర్ఎస్ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని డీకే అరుణ పేర్కొన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూమి కేటాయింపు, భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విషయమని, బోగీల మరమ్మతు వర్క్ షాప్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో భూమి సేకరించకుండా నిర్లక్ష్యం చేసిందని డీకే అరుణ ఆరోపించారు. 1982లో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇస్తానని మొండిచెయ్యి చూపించిందని, అసలు వరంగల్ కు కోచ్ ఫ్యాక్టరీ రాకపోవడానికి కాంగ్రెస్ పార్టీనే మొదటి ముద్దాయి అని డీకే అరుణ మండిపడ్డారు.

Recommended Video

సీడీఎస్‌ బిపిన్ రావత్‌కు నివాళులు అర్పించిన బీజేపీ నేత డీకే అరుణ || Oneindia Telugu
కోచ్ ఫ్యాక్టరీ కోసం కాంగ్రెస్ గోల చెయ్యటం విడ్డూరం

కోచ్ ఫ్యాక్టరీ కోసం కాంగ్రెస్ గోల చెయ్యటం విడ్డూరం


ఇప్పుడు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం కాంగ్రెస్ పార్టీ అఖిల పక్షం అని గోల చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటు చేయడం కోసం ఇప్పటికీ కట్టుబడి ఉందని డీకే అరుణ పేర్కొన్నారు. టిఆర్ఎస్ సర్కార్ పై అనవసర రాద్ధాంతం మానుకొని, కేంద్రానికి సహకరించి తెలంగాణ అభివృద్ధి అందిపుచ్చుకోవాలని డీకే అరుణ హితవుపలికారు.

English summary
BJP national vice-president DK Aruna has blamed TRS MPs for boycotting the President's address in the budget sessions of Parliament. DK Aruna was outraged that the TRS party was murdering democracy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X