వైఎస్ షర్మిల ఏపీలో ఎందుకు పోటీచెయ్యదు.. పార్టీ పెట్టింది అందుకే.. డీకే అరుణ సంచలనం

విజయవాడ: వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పై బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటుగా స్పందించారు. విజయవాడ లో పర్యటించిన డీకే అరుణ వైయస్ షర్మిల పార్టీ పెట్టడానికి గల కారణాన్ని వెల్లడించారు. వైఎస్ కుటుంబంలో వచ్చిన విభేదాల వల్లే వైయస్ షర్మిల పార్టీ పెట్టారని పేర్కొన్న డీకే అరుణ, గతంలో వైఎస్ కుటుంబం ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది లేదని, పని చేసింది లేదని గుర్తు చేశారు.

తెలంగాణాలో షర్మిల పార్టీ పెట్టింది అందుకే

తెలంగాణాలో షర్మిల పార్టీ పెట్టింది అందుకే


తెలంగాణాలో వైయస్ షర్మిల పార్టీ ప్రభావం ఏమాత్రం ఉండబోదని పేర్కొన్నారు డీకే అరుణ. కుటుంబ సభ్యులతో విభేదాల వల్ల తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టారంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సెంటిమెంటు ఉన్నంతవరకు ఆంధ్ర వాళ్ళు ఎవరు పార్టీ పెట్టినా ప్రజలు ఆదరించేది లేదని డీకే అరుణ స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో షర్మిల ఏపీలో పోటీ చేయొచ్చు కదా తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారు అంటూ ప్రశ్నించారు డీకే అరుణ. గతంలో ఆంధ్ర పాలకుల వివక్షకు గురి అయ్యామని ఇప్పుడు స్వయంపాలన సాధించుకోవాలనే సెంటిమెంటుతో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు సాధించుకున్నారు అని డీకే అరుణ పేర్కొన్నారు.

దమ్ముంటే వైయస్ షర్మిల ఏపీలో పోటీ చేయాలని సవాల్

దమ్ముంటే వైయస్ షర్మిల ఏపీలో పోటీ చేయాలని సవాల్


వైయస్ షర్మిల తెలంగాణ కోసం ఎప్పుడూ పోరాటం చేసింది లేదని, తెలంగాణ రాష్ట్ర సాధనకు పట్టుబట్టింది లేదని పేర్కొన్న డీకే అరుణ ఇప్పుడు తెలంగాణ ఆడపడుచును, కోడలిని అంటూ తెలంగాణలో పోటీకి సిద్ధమైందని వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే వైయస్ షర్మిల ఏపీలో పోటీ చేయాలని సవాల్ విసిరారు డీకే అరుణ. 2019 ఎన్నికలలో కూడా ఏపీలో వైయస్ షర్మిల ప్రచారం చేశారని, అప్పుడు కూడా ఆమె తెలంగాణను పట్టించుకున్నది లేదని డీకే అరుణ పేర్కొన్నారు. ఇక ఇప్పుడు తెలంగాణాలో ఎందుకు పోటీ చేస్తున్నారో వైయస్ షర్మిల చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

తెలంగాణ సెంటిమెంటు ఉన్నంత వరకు ఆంధ్ర నాయకులు గెలవరు

తెలంగాణ సెంటిమెంటు ఉన్నంత వరకు ఆంధ్ర నాయకులు గెలవరు


తెలంగాణలో ఎవరికైనా అధికారం ఇస్తామనే పరిస్థితుల్లో ప్రజలు లేరని, తెలంగాణ సెంటిమెంటు ఉన్నంత వరకు షర్మిల లేదా ఆంధ్ర నాయకులు ఎవరొచ్చినా గెలిచే పరిస్థితి లేదని డీకే అరుణ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం అంత ఈజీ కాదని డీకే అరుణ పేర్కొన్నారు. అంతేకాదు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇటీవల ముంపు మండలాల విషయంలో చోటుచేసుకున్న వివాదం పై స్పందించిన డీకే అరుణ విభజన సందర్భంగా ఏపీలో ముంపు మండలాలను కలిపారని, అప్పుడు అంగీకరించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు రాజకీయ కారణాలతో మాట్లాడుతున్నాడని విమర్శించారు.

 ముంపు మండలాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ అందుకే

ముంపు మండలాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ అందుకే


ముంపు మండలాల ప్రజలు తెలంగాణలో కలపాలని ఎప్పటినుండో కోరుతున్నారని, ఏపీ ప్రభుత్వం అక్కడి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం తోనే ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతుందని డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఇక బిజెపి కుటుంబ పాలనకు వ్యతిరేకం అని చెప్పిన డీకే అరుణ, ప్రస్తుతం బీజేపీ లో చేరడానికి చాలామంది నాయకులు ఆసక్తి చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ లో చేరడానికి క్రింది స్థాయి నుండి పెద్ద స్థాయి నాయకుల వరకు ఉన్నారని, అయితే వారిని పార్టీలో ఎప్పుడు చేర్చుకోవాలి అన్న దానిపై బీజేపీ అధినాయకత్వంపై నిర్ణయం తీసుకుంటుందని డీకె అరుణ తెలిపారు.

కెసిఆర్, జగన్ ఎన్నికల కోసం మాత్రమే రాజకీయాలు చేస్తారు

కెసిఆర్, జగన్ ఎన్నికల కోసం మాత్రమే రాజకీయాలు చేస్తారు

ఇక తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీలో చేరికలకు చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారని డీకే అరుణ వెల్లడించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్న డీకే అరుణ కెసిఆర్, జగన్ ఎన్నికల కోసం మాత్రమే రాజకీయాలు చేస్తారని, ఒకరినొకరు ఎన్నికల సమయంలోనే విమర్శిస్తారు అని డీకే అరుణ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+