వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేల కొనుగోలుపై గంటలకొద్దీ సోది; కేసీఆర్ చేసింది కామెడీ షోలా ఉంది: డీకే అరుణ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్ మూడు గంటల సుదీర్ఘ వీడియో ఉందని పేర్కొన్న ఆయన, దానిని గంటం పావుకు కుదించి మీడియాకు చూపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిర పరచడం కోసం బీజేపీ అగ్రనేతలు కుట్రలు చేశారని సీఎం కేసీఆర్ వారిని టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తనదైన శైలిలో కౌంటర్ వేశారు.

ప్రజాస్వామ్య విలువల గురించి కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం

ప్రజాస్వామ్య విలువల గురించి కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం

కెసిఆర్ రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు డీకే అరుణ. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను రాజీనామాచేయకుండానే తన పార్టీలో చేర్చుకొని దాన్ని రాజ్యాంగబద్ధం అనడం కెసిఆర్ సిగ్గుమాలిన తనానికి నిదర్శనం అని డీకే అరుణ మండిపడ్డారు. కర్ణాటక,మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇతర పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బిజెపి టిక్కెట్ పై ప్రజల మద్దతుతో గెలిస్తే అప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించిన డీకే అరుణ, అసలు బీజేపీ తో సంబంధం లేని వాళ్ళు బిజెపి జాతీయ నాయకుల పేర్లు తీసి మాట్లాడినంత మాత్రాన వారు బిజెపి వారు ఎలా అవుతారని, బిజెపిలో వాళ్ళ పాత్ర ఏంటని డీకే అరుణ ప్రశ్నించారు.

కొనుగోలు డ్రామాను బిజెపికి అంటగట్టడం కెసిఆర్ చిల్లర మనస్తత్వానికి నిదర్శనం

కొనుగోలు డ్రామాను బిజెపికి అంటగట్టడం కెసిఆర్ చిల్లర మనస్తత్వానికి నిదర్శనం

బిజెపికి సంబంధంలేని వారు బిజెపి జాతీయ నాయకుల పేర్లు తీసుకున్నంత మాత్రానకొనుగోలు డ్రామాను బిజెపికి అంటగట్టడం కెసిఆర్ చిల్లర మనస్తత్వానికి నిదర్శనం అని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1946లో మరణించిన మదన్ మోహన్ మాలవ్యా ఎమర్జెన్సీ ఉద్యమంలో పాల్గొన్నారు అని చెప్పడం కెసిఆర్ మేధావితత్వానికి పరాకాష్ట డీకే అరుణ ఎద్దేవా చేశారు. కేసులపై భయం లేనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించిన ఆమె ప్రజలు త్వరలోనే కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమికొడతారు అని స్పష్టం చేశారు.

కేసీఆర్ డ్రామాకు బీజేపీ భయపడుతుంది అనుకోవటం కేసీఆర్ పిచ్చితనమే

కేసీఆర్ డ్రామాకు బీజేపీ భయపడుతుంది అనుకోవటం కేసీఆర్ పిచ్చితనమే

కెసిఆర్ అహంకారాన్ని, కుటుంబ ఆధిపత్యాన్ని భరించలేక టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న ఎమ్మెల్యేలను నియంత్రించడానికి ఆడుతున్న ఈ కొనుగోళ్ల డ్రామాకు బిజెపి శ్రేణులు భయపడతాయని భావించడం కెసిఆర్ పిచ్చితనమే అవుతుందని డీకే అరుణ స్పష్టం చేశారు దేశంలో దుర్మార్గంగా ప్రభుత్వాలను కూల్చే కుట్ర జరుగుతోందని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ డీకే అరుణ దుర్మార్గంగా పక్క పార్టీ నేతలను పార్టీ ఫిరాయింపుల చేసే తత్వం కెసిఆర్ కే ఉందన్నారు.

కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ప్రజలకు కామెడీ షో లా అనిపించింది

కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ప్రజలకు కామెడీ షో లా అనిపించింది

దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థను, పత్రికా వ్యవస్థనుభాషా ప్రావీణ్యంతో ప్రభావితం చేయగలనని భావిస్తూ కెసిఆర్చేస్తున్న ప్రయత్నాలు ప్రజలకు కామెడీ షో లాగా అనిపిస్తుంది. ఇప్పటికే విచారణలో ఉన్న కేసు పట్ల రాజ్యాంగబద్ధ పదమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రభావితం చేసేలా మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధం అని డీకే అరుణ పేర్కొన్నారు. ఈ విషయం స్వయంప్రకటిత మేధావైన కెసిఆర్ కుతెలియదా? అని డీకే అరుణ ప్రశ్నించారు

నెలకోసారి మీడియా ముందుకు.. గంటల తరబడి సోది

నెలకోసారి మీడియా ముందుకు.. గంటల తరబడి సోది


నెలకోసారి మీడియా ముందుకు వచ్చి గంటల తరబడి చెప్పిన సోదే మళ్లీ మళ్లీ చెబుతూజాతీయ నాయకుడివి అయిపోయానని భావిస్తే అది కెసిఆర్ మానసిక పరిస్థితికి అద్దం పడుతుందని డీకే అరుణ అభిప్రాయపడ్డారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ప్రజల మద్దతుతో, ప్రజలకు సేవ చేస్తూ దేదీప్యమానంగా వెలుగుతున్న బిజెపి ప్రభను చూసి తట్టుకోలేక కెసిఆర్ ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నాడని డీకే అరుణ పేర్కొన్నారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎందుకు అడ్డుకుంటున్నారు?

కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎందుకు అడ్డుకుంటున్నారు?

తెలంగాణ రాష్ట్రంలో వ్యవస్థలను పూర్తిగా భ్రష్టు పట్టించి చివరకు ఎన్నికల తీరును అధమ స్థానానికి దిగజార్చిన కెసిఆర్ కు బిజెపి నాయకత్వం గురించి మాట్లాడే అర్హత కూడా లేదని డీకే అరుణ అభిప్రాయపడ్డారు. కెసిఆర్ మొరిగే మొరుగులకు, వాగే వాగుడును పట్టించుకునే అవసరం మాకు లేదు అన్నారు డీకే అరుణ. తెలంగాణలో అధికారం అడ్డుపెట్టుకొనికెసిఆర్ కుటుంబం దోచిన సొమ్మునుకక్కించి ప్రజాక్షేత్రంలోదోషిగా నిలబెట్టే వరకు మా ఈ పోరాటం ఆగదు అని డీకే అరుణ స్పష్టం చేశారు.

English summary
DK Aruna said that KCR's efforts in front of the media in the matter of buying MLAs is like a comedy show. KCR's purchase drama is a proof of KCR's petty mentality, she said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X