వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రణయ్ వస్తాడని అమృతను ఒకరోజు నమ్మించా!: ఎన్నో విషయాలు చెప్పిన డాక్టర్

|
Google Oneindia TeluguNews

మిర్యాలగూడ: ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి మిర్యాలగూడకు చెందిన డాక్టర్ జ్యోతి ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. మారుతిరావు దంపతులకు పెళ్లయ్యాక చాలాకాలానికి అమృత వర్ణిణి పుట్టిందని, తన ఆసుపత్రిలోనే మారుతి రావు సతీమణి డెలివరీ చేసుకుందని గుర్తు చేసుకున్నారు. అమృతను తల్లిదండ్రులు ఎంతో అపురూపంగా చూసుకునే వారని తెలిపారు.

అమృత తల్లికి తాను రెగ్యులర్‌గా చెక్ చేసే దానిని అని, ఆమె డెలివరీ కష్టంగా జరిగిందని, అమృత బాబాయ్ పిల్లలు సహా వారి ఇంట్లోని చాలామంది పిల్లలు తమ ఆసుపత్రిలోనే పుట్టారని తెలిపారు. అందుకే ఆ కుటుంబం తనకు ఫ్యామిలీ ఫ్రెండ్‌గా మారిందని, వారి ఇంటికి తరుచూ వెళ్లే దానిని అని చెప్పారు.

Recommended Video

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్

ప్రణయ్ హత్య: పాతికేళ్ల క్రితం.. అమృత తండ్రి గురించి షాకింగ్ విషయాలు! కూతురుపై ఎంత ప్రేమంటే?ప్రణయ్ హత్య: పాతికేళ్ల క్రితం.. అమృత తండ్రి గురించి షాకింగ్ విషయాలు! కూతురుపై ఎంత ప్రేమంటే?

అమృత ఆంటీ అని పిలిచేది

అమృత ఆంటీ అని పిలిచేది

అమృతతో తనకు బాగా పరిచయం ఉందని, ఆంటీ అని పిలిచేదని, ఆమె గర్భందాల్చాక భయపడుతూ తన వద్దకు వచ్చిందని, తాను పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారానే తెలుసుకున్నానని చెప్పారు. ప్రెగ్నెన్సీ కారణంగా ఆమెకు తాను జాగ్రత్తలు చెప్పేదానిని అన్నారు. తన ఆసుపత్రి ముందు ఈ ఘటన జరగడం బాధేస్తోందన్నారు.

ప్రణయ్‌ని చూశాక కోలుకోవడానికి చాలా సమయం పట్టింది

ప్రణయ్‌ని చూశాక కోలుకోవడానికి చాలా సమయం పట్టింది


తన కళ్ల ముందే ప్రణయ్ ఊపిరిపోయిందని, తాను కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని డాక్టర్ అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జ్యోతి కంటతడి పెట్టారు. ఐదు నిమిషాల ముందే ప్రణయ్, అమృత తన వద్ద ఉన్నారని, వారికి జాగ్రత్తలు చెప్పి, మళ్లీ పది రోజుల తర్వాత రావాలని చెప్పానని, అంతలోనే ఇది జరిగిందన్నారు.

ప్రణయ్‌ని పొడిచారంటూ కంటతటి

ప్రణయ్‌ని పొడిచారంటూ కంటతటి

వారు బయటకు వెళ్లిన కాసేపటికే... ఆంటీ.. ఆంటీ ప్రణయ్‌ను పొడిచారు అంటూ అమృత తన వద్దకు పరుగెత్తుకు వచ్చిందని, ఆ తర్వాత బయటకు వెళ్లి చూసేసరికి అమృత కిందపడిపోయిందన్నారు. ప్రణయ్ చనిపోయిన విషయం మరుసటి రోజు వరకు అమృతకు చెప్పలేదన్నారు. అమృత ఉన్న పరిస్థితుల్లో తనకు అంతకన్నా మార్గం లేదన్నారు. విషయం తెలిస్తే ఏం జరుగుతుందోననే భయంతో బతికే ఉన్నాడని మొదట చెప్పామని అన్నారు.

ప్రణయ్ వస్తాడని ఒకరోజు నమ్మించా

ప్రణయ్ వస్తాడని ఒకరోజు నమ్మించా

ఫస్ట్ ఎయిడ్ చేశామని, అంబులెన్స్‌లో హైదరాబాదుకు పంపించామని అమృతకు చెప్పామని డాక్టర్ అన్నారు. ప్రణయ్ తప్పకుండా వస్తాడని ఓ రోజంతా అమృతను నమ్మించామని తెలిపారు. ఆ తర్వాత పరిస్థితి విషమంగా ఉందంటూ అమృతను ప్రిపేర్ చేశామన్నారు. అసలు విషయం చెప్పాక అమృత వద్దే మూడు గంటలు ఉండి ఓదార్చానని డాక్టర్ తెలిపారు. ప్రణయ్ హత్యను అందరూ ఖండించాలన్నారు.

English summary
Nalgonda district's Miryalaguda doctor talks about Pranya's murder and Amrutha. She condemned Pranay murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X