ఆ జెండా కోసం పోలీస్ జాగిలాలు, ఊరంతా టెన్షన్; ఏం జరిగిందో తెలిసి అవాక్కయిన జనాలు!!
రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరిగితే, పెద్ద పెద్ద చోరీలు జరిగితే, ఎవరి పైన అయినా దాడులు జరిగితే అటువంటి కేసుల దర్యాప్తులో నత్తకు నడక నేర్పుతూ, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఓ కేసులో వ్యవహరించిన తీరు అందరినీ విస్మయానికి గురి చేసింది. పోలీసుల్లో ఇంత పనితనం ఉందా అన్న చర్చకు కారణమైంది. ఈ మాత్రం దానికి ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకో అన్న చర్చ జరిగింది. రాజు తలుచుకునే దెబ్బలకు కొదవా? అన్నట్టు పెద్ద సినిమానే నడిచింది.

పోలీసు జాగిలాలతో ఊరంతా గాలింపు చేపట్టి హంగామా
ఇంతకీ ఏం జరిగిందంటే, ఏదో పెద్ద హత్య కేసును దర్యాప్తు చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చిన పోలీసులు వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ లోని మల్లెమోనిగూడ లో టిఆర్ఎస్ పార్టీ జెండా కోసం దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ గ్రామంలో గ్రామస్తులంతా ఎవరో దొంగల్ని పట్టుకోడానికి, లేదా హంతకులను పట్టుకోవడానికి పోలీస్ కుక్కలు వచ్చాయని, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారని చర్చించుకుంటే ఇక అసలు విషయం తెలిసినవారు ఆ తర్వాత అవాక్కయ్యారు. పోలీసు జాగిలాలతో ఊరంతా గాలింపు చేపట్టి హంగామా చేసిన పోలీసుల సిన్సియారిటీకి షాక్ తిన్నారు.

టీఆర్ఎస్ పార్టీ జెండా మాయం .. కేసు నమోదు .. పోలీసుల దర్యాప్తు
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని మల్లెమోనిగూడ లో రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు టిఆర్ఎస్ పార్టీ జెండా ఎత్తుకెళ్ళారని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పరిగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఎలాగైనా జెండాను పట్టుకుని తీరుతామని రంగంలోకి దిగారు. ఇక విచారణలో భాగంగా పోలీస్ జాగిలాన్ని తీసుకువచ్చి టిఆర్ఎస్ పార్టీ జెండా గద్దె దగ్గర ప్రాంతమంతా పోలీస్ డాగ్ ను తిప్పారు. పోలీస్ కుక్కలతో హడావిడి కొనసాగుతుంటే, గ్రామస్తులంతా ఏం జరిగిందో అని ఆసక్తిగా చూశారు. వాటితోపాటు పరుగులు తీశారు.

పోలీస్ కుక్కల హడావిడితో గందరగోళంలో గ్రామస్తులు
ఎక్కడ ఏం జరిగిందో అర్థం కాక గందరగోళానికి గురయ్యారు గ్రామస్తులు. గ్రామంలోకి పోలీసులు, పోలీసు వాహనాలు, పోలీస్ కుక్కలు రావడంతో ఎంత భయంకరమైన నేరం జరిగిందో అంటూ గుసగుసలాడుకున్నారు. ఎక్కడా? ఏం జరిగిందట అంటూ ఆరా తీశారు. తీరా టిఆర్ఎస్ పార్టీ జెండా కోసమే పోలీసు జాగిలాలు రంగంలోకి దిగాయి అని తెలిసి ప్రజలు షాక్ అయ్యారు. పెద్ద పెద్ద నేరాలు జరిగితే పట్టించుకోని పోలీసులు అధికార పార్టీ జెండా పోతే రియాక్ట్ అయిన విధానం చూసి పెదవి విరిచారు. అధికార టీఆర్ఎస్ జెండా పోతే పట్టుకోకుంటే తమకు ఏం ఇబ్బంది వస్తుంది అనుకున్నారో.. అధికార పార్టీ నేతలతో చివాట్లు పడతాయి అనుకున్నారో ఏమోగానీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

పార్టీ జెండా కోసం పోలీసు జాగిలాలా .. నవ్విపోతున్న జనాలు
ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కేవలం పార్టీ జెండా కోసం పోలీసు జాగిలాలు ఉపయోగించడంపై పోలీస్ అధికారులను ప్రశ్నించినా ఎవరూ సమాధానం చెప్పకపోవడం గమనార్హం. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా వ్యవహరించిన పోలీసుల తీరు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ జెండా పోలీసు జాగిలాలు కనిపెట్టాయా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications