వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కామాంధుల బారిన పడకుండా.. ఇంట్లో ఆడపిల్లలకు ఈ విషయాలు చెప్పటం మర్చిపోకండి!!

|
Google Oneindia TeluguNews

సమాజంలో రోజురోజుకీ ఆడ పిల్లలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న పిల్లలను సైతం మానవ మృగాలు తమ లైంగిక అవసరాల కోసం వాడుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. చాలా మంది చిన్న పిల్లలు తమపై జరుగుతున్న లైంగిక దాడిని అర్థం చేసుకోలేక, ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు.

 ఆడపిల్లలు అపరిచితులతో బీ కేర్ ఫుల్

ఆడపిల్లలు అపరిచితులతో బీ కేర్ ఫుల్


ఇక లైంగిక దాడులు సమాజంలో పెరుగుతున్న నేపథ్యంలో ఆడ పిల్లలకు చిన్నతనం నుండే తల్లి కొన్ని విషయాలను చెప్పాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు బయట ఆడుకునేటప్పుడు, లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా అపరిచితులు పలకరించి, మాట్లాడి తమతోపాటు రమ్మంటే వెళ్లకూడదని చిన్నతనం నుంచే తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. చాక్లెట్ ఇస్తాము, బిస్కెట్ ఇస్తాము అని చెప్పినా కూడా వెళ్లకూడదని చిన్నారులకు తల్లి చెబుతూ ఉండాలి.

ఆ ప్రదేశాల్లో ఎవరు చెయ్యి వేసినా వారించాలి

ఆ ప్రదేశాల్లో ఎవరు చెయ్యి వేసినా వారించాలి


స్కూల్లో చదువుకోడానికి వెళ్లిన క్రమంలో ఎవరైనా బాలికల శరీరంపై కొన్ని ప్రదేశాలలో చెయ్యివేస్తే వెంటనే తీయమని చెప్పాలని, ఒకవేళ వారికి ఇబ్బంది ఏమైనా కలిగితే ఇంటికి వచ్చి తల్లికి చెప్పాలన్న విషయాన్ని ముందుగానే చెప్పాలి. ముఖ్యంగా బాలికలు ఎవరైనా అమ్మాయి తొడపై చెయ్యి వేసి నిమురుతూ మాట్లాడుతుంటే, అది తనకు ఇబ్బందిగా ఉందని, చెయ్యి తీయమని బాలికలు వారికి గట్టిగా చెప్పాలని తల్లి ఈ విషయాన్ని పిల్లలకు ముందే చెప్పాలని నిపుణులు చెబుతున్నారు.

 దగ్గరి బంధువులు అయినా సరే జాగ్రత్త

దగ్గరి బంధువులు అయినా సరే జాగ్రత్త


ఇక అలాగే కొంతమంది భుజాలపై చేయి వేసి నొక్కుతూ ఉంటారు. ఇక అటువంటి వారి విషయంలో కూడా బాలికలు భుజంపై చెయ్యి వేసినప్పుడు, వెంటనే తీయమని చెప్పాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎవరైనా తల పైన చెయ్యి వేసి నిమరటానికి ప్రయత్నం చేసినా వెంటనే చెయ్యి తీయమని చెప్పాలని చెబుతున్నారు. దగ్గరి బంధువులు అయినా సరే బాలికలు ఈ విషయంలో చెయ్యి తియ్యమని చెప్పాలని అంటున్నారు.

 బాలికలు అలెర్ట్ గా ఉంటే బయట చెప్తారని కామాంధులకు భయం

బాలికలు అలెర్ట్ గా ఉంటే బయట చెప్తారని కామాంధులకు భయం


ఈ విషయాలలో బాలికలు అలర్ట్ గా ఉంటే, అటువంటి బాలికలు ఏదైనా చేస్తే బయట చెబుతారు అనే భయం సదరు లైంగిక దాడులకు పాల్పడే మానవ మృగాలకు ఉంటుందని మానసిక నిపుణులు అంటున్నారు. అటువంటి బాలికల పైన లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయరని నిపుణులు చెబుతున్నారు. ఇక కాస్త పెద్ద పిల్లలు అవతలి వ్యక్తి ప్రవర్తన బట్టి జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా అనుమానం అనిపిస్తే తల్లికి చెప్పాలని అంటున్నారు. అమాయకంగా ఉన్నట్టు అనిపిస్తే అనర్ధాలు జరుగుతాయని అందుకే జాగ్రత్త అంటున్నారు.

 పిల్లల విషయంలో తల్లులు కూడా బీ అలెర్ట్

పిల్లల విషయంలో తల్లులు కూడా బీ అలెర్ట్


ఇక తల్లులు సైతం పిల్లల ప్రవర్తనలో తేడా గుర్తించాలని అంటున్నారు. పిల్లలు సడన్ గా డల్ గా మారితే, భయపడుతుంటే, నార్మల్ గా ప్రవర్తించకుంటే కచ్చితంగా ఆ బాలికను కూర్చోబెట్టుకుని తాను ఎందుకు అలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలని అంటున్నారు. వారికి ఏదైనా చెప్పుకునేలా తల్లి చాలా స్నేహపూర్వకంగా ఉండాలని అంటున్నారు. ఏది ఏమైనా ఆడపిల్లల రక్షణ విషయంలో బీ కేర్ ఫుల్..

English summary
Psychiatrists say that girls should be told by mothers many things at home so that they don't fall victim to sexual abuse, don't go out with strangers, tell them to stay alert for men's behavior, and don't forget to tell them if any problems arise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X