వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేతలకు కేసీఆర్ క్లాస్, మరో కొత్త పాట (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి నదుల వినియోగాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజాప్రతినిధులకు సమగ్రంగా వివరించారు. ఇంజనీర్ తరహాలో నీటిపారుదల రంగంపై పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు. ఏ ప్రాజెక్టుకు ఏ నదినుంచి నీళ్లు ఏవిధంగా వస్తాయో గూగుల్ మ్యాపులో చూపుతూ పాఠం చెప్పారు.

నాగార్జున సాగర్‌లో జరుగుతున్న తెరాస ప్రజాప్రతినిధులకు శిక్షణలో భాగంగా చివరి రోజు సిఎం కేసీఆర్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, నియోజకవర్గ ఇంఛార్జులతో ప్రత్యేకంగా మాట్లాడారు.

తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టుల రీ-ఇంజనీరింగ్ అవసరముందని సిఎం అభిప్రాయపడ్డారు. వివాదాలు, పెద్దగా ముంపులేకుండా ఎక్కువ నీటిని నదులనుంచి తరలించుకోవాలని, పాలమూరు, కల్వకుర్తిలాంటి ప్రాజెక్టులకు రీ-ఇంజనీరింగ్ అవసరం ఉందన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో మన వాటాకు అనుగుణంగా నీటిని వాడుకోవడానికి అవసరమయ్యే ప్రాజెక్టులన్నీ నిర్మించుకుందామన్నారు.

కేసీఆర్

కేసీఆర్

ప్రాణహిత ప్రాజెక్టును ఆచరణయోగ్యంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏ ప్రాజెక్టును నిర్మించాలనుకుంటున్నదీ, ఏ నదిలో ఎక్కడి నుంచి నీరు తీసుకోవాలనుకుంటున్నదీ ముఖ్యమంత్రి గూగుల్ మ్యాప్‌లో చూపించారు.

కేసీఆర్

కేసీఆర్

ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, నియోజకవర్గ ఇంఛార్జిలు కూడా కీలకపాత్ర వహించాలని కెసఆర్ సూచించారు. నియోజకవర్గ ఇంఛార్జీలను మంత్రులు కడుపులో పెట్టుకొని చూసుకోవాలని సూచించారు.

కేసీఆర్

కేసీఆర్

నల్గొండ జిల్లాలో నిర్మించ తలపెట్టిన నక్కలగండి ప్రాజెక్టు ప్రాంతాన్ని సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. నీటిపారుదల మంత్రి హరీశ్ రావు, విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డిలతో కలిసి హెలిక్యాప్టర్ ద్వారా నక్కలగండి ప్రాజెక్టును వీక్షించారు.

కేసీఆర్

కేసీఆర్

సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు, సమస్యల పైన మనమే యుద్ధం చేయాలని, మనమంతా పట్టుబట్టాలని, జట్టు కట్టాలని, కుల, మత బేధాలు లేకుంటా సమష్టిగా పని చేయాలని కేసీఆర్ ఇబ్రహీంపట్నం సభలో అన్నారు.

కేసీఆర్

కేసీఆర్

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో చూడాలనే ఆసక్తితో దేశం అంతా మన వైపు చూస్తోందన్నారు.

కేసీఆర్

కేసీఆర్

65 ఏళ్ల పాపాన్ని తాము కడిగేస్తున్నామని, పాత ప్రభుత్వం పెండింగులో పెట్టిన పనులన్నీ చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు.

కేసీఆర్

కేసీఆర్

నల్లా నీళ్లు ఇవ్వకుంటే తాను మళ్లీ ఓట్లు అడగనని కేసీఆర్ చెప్పారు. అదే సమయంలో కేసీఆర్ మరో పాట కూడా పాడారు. రెండేళ్లలో నిరంతర విద్యుత్ ఇవ్వకుంటే ఓట్లు అడగనని చెప్పారు.

English summary
Chief Minister K. Chandrasekhar Rao asked the elected representatives of Telangana Rastra Samithi (TRS) to distance themselves from corrupt activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X