కేసిఆర్‌ను నమ్మొద్దు, సోనియానే మోసం చేశారు: దీదీతో విహెచ్
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావును విశ్వసించకూడదని కాంగ్రెసు నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చెప్పారు. ఢిల్లీలో ఆయన మమతా బెనర్జీని కలిశారు. కేసిఆర్ విశ్వసించదగినవాడు కాదని ఆయన మమతతో చెప్పారు.
తనను నమ్మినవారిని మోసం చేసే గుణం కేసిఆర్‌కు ఉందని ఆన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెసులో విలీనం చేస్తానని హామీ ఇచ్చారని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత సోనియా గాంధీని మోసం చేశారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌ను పక్కన పెట్టారని, కేసిఆర్‌తో పాటు కోదండరామ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరాటం చేశారని ఆయన చెప్పారు.
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ప్రకటన వెనక కేసిఆర్‌కు రెండు లక్ష్యాలు ఉన్నాయని, మోదీ వ్యతిరేక.. బిజెపి వ్యతిరేక ఓటును చీల్చలడం ద్వారా బిజెపి ఉపయోగపడడం ఒకటి కాగా, కెటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడం రెండోదని తాను మమతా బెనర్జీకి చెప్పినట్లు విహెచ్ తెలిపారు.












Click it and Unblock the Notifications