వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్‌ దెబ్బ: 'శత్రువులెవరో, మిత్రులెవరో చెప్పలేం, స్వంత పనంటూ ఢిల్లీకి'

తెలుగుదేశం పార్టీలో ఎవరుంటారో ఎవరు బయటకు వెళ్ళిపోతారో అర్థంకాని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాకు మిత్రులెవరో..

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో ఎవరుంటారో ఎవరు బయటకు వెళ్ళిపోతారో అర్థంకాని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాకు మిత్రులెవరో.. శత్రువులెవరో ఇప్పుడే చెప్పలేమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ పేర్కొనడం సమస్య తీవ్రతను అర్ధం చేస్తోంది.

Recommended Video

News Roundup న్యూస్ రౌండప్ : లేటెస్ట్ అప్‌డేట్స్‌

రేవంత్‌ వెనుక కాంగ్రెస్ సీనియర్లు: డికె అరుణతో చర్చలు, కోమటిరెడ్డి బ్రదర్స్ డైలమా?రేవంత్‌ వెనుక కాంగ్రెస్ సీనియర్లు: డికె అరుణతో చర్చలు, కోమటిరెడ్డి బ్రదర్స్ డైలమా?

టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్తారనే ప్రచారం ఆ పార్టీ క్యాడర్‌ను గందరగోళంలో పడేసింది. రేవంత్‌తో పాటు పలువురు నేతలు కూడ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారని ప్రచారంతో నష్టనివారణ చర్యలకు టిడిపి నాయకత్వం పూనుకొంది.

బాబుకు షాక్: 40 సీట్లకు పట్టు, 25 సీట్లకు ఓకే: రేవంత్ వ్యూహమిదే!బాబుకు షాక్: 40 సీట్లకు పట్టు, 25 సీట్లకు ఓకే: రేవంత్ వ్యూహమిదే!

టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన నుండి వచ్చిన తర్వాత చంద్రబాబుతో సమావేశం కానున్నట్టు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తాను టిడిపిలోనే కొనసాగుతానని ప్రకటించారు. మీడియాలో వస్తున్న వార్తలను రేవంత్‌రెడ్డి కొట్టిపారేశారు.

రాహూల్‌తో రేవంత్ భేటీ, నవంబర్ 9న, కాంగ్రెస్‌లోకి?రాహూల్‌తో రేవంత్ భేటీ, నవంబర్ 9న, కాంగ్రెస్‌లోకి?

కానీ, రేవంత్ చేసిన ప్రకటనలో స్పష్టత లేదని టిడిపి నేతలు అభిప్రాయపడ్డారు. ఈ విషయమై రేవంత్‌రెడ్డి నుండి మరింత స్పష్టత కావాలని టిడిపి నేతలు కోరుకొంటున్నారు. కానీ, రేవంత్‌ నుండి ఇప్పటివరకు స్పష్టత రాలేదు. మంగళవారం నాడు టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ మీడియాతో చిట్‌చాట్ చేశారు.

వెల్‌కమ్ వ్యూహం: వైఎస్ అప్పుడలా, కెసిఆర్ ధీమా అదేనా?వెల్‌కమ్ వ్యూహం: వైఎస్ అప్పుడలా, కెసిఆర్ ధీమా అదేనా?

తెలంగాణ టిడిపిలో గందరగోళం

తెలంగాణ టిడిపిలో గందరగోళం

మాకు మిత్రులెవరో.. శత్రువులెవరో ఇప్పుడే చెప్పలేమని తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ అభిప్రాయపడ్డారు. మంగళవారం నాడు రమణ మీడియాతో చిట్ చాట్ చేశారు. పార్టీలో చోటుచేసుకొన్న పరిణామాలపై రమణ స్పందించారు. పార్టీలో పరిణామాలన్నీ అధినేత చంద్రబాబునాయుడుకు ఎప్పటికప్పుడు వివరిస్తున్నట్టు ఎల్.రమణ చెప్పారు. తెలంగాణలో చోటుచేసుకొన్న పరిణామాలపై చంద్రబాబునాయుడుకు పార్టీ నేతలు సమాచారం అందిస్తున్నారు.

 వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని రేవంత్ కోసం సృష్టించారు

వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని రేవంత్ కోసం సృష్టించారు

టిడిపిలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అనే సంప్రదాయం లేనేలేదు. రేవంత్‌రెడ్డికి పదవిని కట్టబెట్టే ఉద్దేశ్యంతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రేవంత్‌రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టారు. పార్టీకి విధేయుడుగా ఉన్న ఎల్. రమణకు అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టారు. అయితే పార్టీని మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్ళేందుకు రేవంత్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టారు. పార్టీ సీనియర్లకు రేవంత్‌కు ఈ పదవిని కట్టబెట్టడం కొంత అసంతృప్తిని కల్గించింది. అయితే పార్టీ అవసరాలరీత్యా రేవంత్‌కు ఈ పదవిని ఇవ్వక తప్పని అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

ఢీల్లీకి స్వంత పనిమీద వెళ్తున్నట్టు చెప్పిన

ఢీల్లీకి స్వంత పనిమీద వెళ్తున్నట్టు చెప్పిన

తన స్వంత పనిమీద ఢిల్లీకి వెళ్తున్నట్టు రేవంత్‌రెడ్డి చెప్పారని టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ చెప్పారు. అయితే ఢిల్లీలో చోటుచేసుకొన్న పరిణామాలపై మీడియాలో వచ్చిన వార్తల ద్వారా తెలుసుకొన్నానని రమణ చెప్పారు. ఢిల్లీలో ఏం జరిగిందో స్పష్టత ఇవ్వాల్సింది రేవంత్‌రెడ్డేనని రమణ అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ వెళ్ళడమే కాదు మరికొందరు నేతలు కూడ రేవంత్ బాటలో పయనించే అవకాశం ఉందని సమాచారం రావడంతో టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నారు. రేవంత్‌ వెంట నడిచిదేవరని ఆరా తీస్తున్నారు.

టిడిఎల్పీ సమావేశంపై వ్యూహమేమిటీ?

టిడిఎల్పీ సమావేశంపై వ్యూహమేమిటీ?

ఈ నెల 27వ, తేది నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమౌతున్నాయి. ఈ సమావేశాలను దృష్ట్యా అక్టోబర్ 26, తేదిన టిడిఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హజరుకావాలని పార్టీ నేతలను కూడ కోరారు రేవంత్‌రెడ్డి. అయితే టిడిఎల్పీ సమావేశానికి తొలుత పార్టీ నేతలు హజరుకావాలని భావించారు. అయితే ఇటీవల చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో టిడిఎల్పీ సమావేశానికి వెళ్ళే విషయమై పునరాలోచిస్తామని రమణ చెప్పారు.

క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ ప్రకటించారు.ఎంత పెద్ద నాయకుడైనా క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. పొత్తుల విషయమై ఎవరూ కూడ మాట్లాడకూడదని ఎల్. రమణ సూచించారు.

English summary
Don't violate disciplane warned TTDP president L. Ramana to party leaders. L. Ramana chit chat with media on Tuesday at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X