రైతు దత్తత: కవితకు రూ. 15లక్షల చెక్కులు అందించారు(ఫొటోలు)

హైదరాబాద్: తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన అడాప్ట్ ఎ ఫార్మర్(రైతు దత్త) కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను దత్తత తీసుకొని.. వారిని అన్నివిధాలుగా ఆదుకోవాలంటూ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపు మేరకు పలువురు స్పందిస్తున్నారు.

ఏఆర్ కన్‌స్ట్రక్షన్స్ కార్పొరేషన్ రూ.10 లక్షలు, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్ రాగం సుజాత రూ.5 లక్షలు ఆర్థికసాయం అందించారు.

Donations to Telangana Jagruthi foundation

ఈ మేరకు గురువారం ఏఆర్ కన్‌స్ట్రక్షన్స్ తరఫున మేనేజింగ్ పార్ట్‌నర్ అఫ్సర్ రియాజ్ గురువారం ఎంపీ కవితను కలిసి చెక్కు అందజేశారు.

కాగా, రాగం సుజాత తన భర్త, టిఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అడ్‌హాక్ కమిటీ సభ్యుడు నాగేందర్‌యాదవ్‌తో కలిసి ఎంపీ కవితకు చెక్కును అందించారు. దాతలు మాట్లాడుతూ.. రైతులకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతుల కోసం తమవంతు సహాయం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.

Donations to Telangana Jagruthi foundation

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు రాజీవ్‌సాగర్, సభ్యులు సంతోష్, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+