Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గాంధీ భవన్ వద్ద గాడిద గుడ్డు.. ఇంట్రెస్టింగ్ స్టోరీ

తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సమయంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీని, బీజేపీ టార్గెట్ చేస్తుంటే, కేంద్రంలోని బిజెపి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా గాంధీభవన్లో గాడిదగుడ్డు అంటూ పెద్ద గుడ్డును ఏర్పాటు చేసి బిజెపిని టార్గెట్ చేసింది.

రూపాయి పంపిస్తే, 43 పైసల బిచ్చం ఇస్తున్న బీజేపీ
కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ వద్ద ఏర్పాటు చేసిన గాడిద గుడ్డు కథ ఏమిటి అంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రానికి ఎన్నో హామీలు ఇచ్చి హామీలను నెరవేర్చలేదని, కేంద్ర కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీల లిస్టును జతచేసి ఇచ్చింది మాత్రం గాడిదగుడ్డు అంటూ పెద్ద గుడ్డును ఏర్పాటు చేసింది. రూపాయి పంపిస్తే, 43 పైసల బిచ్చం ఇచ్చిందని, దీని నుండి విముక్తి కావాలని కాంగ్రెస్ పేర్కొంది.

donkey egg near congress bhavan targets bjp assurances to telangana

బిజెపి ఇచ్చింది మాత్రం గాడిదగుడ్డు
ఇక రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీల వివరాల్లోకి వెళితేపాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగామని కానీ బిజెపి ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ పేర్కొంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా అడిగామని, బడ్జెట్లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా కావాలని అడిగామని, కానీ బిజెపి ఇచ్చింది మాత్రం గాడిదగుడ్డు అంటూ పేర్కొంది.

బీజేపీ తెలంగాణా అడిగినవి ఇవ్వలేదని చెప్పే యత్నం
కనీసం ఒక్క IIM, NID విద్యాలయం, ఒక త్రిబుల్ ఐటీ, మెడికల్ కళాశాల కావాలని కోరిన ఇచ్చింది ఏమీ లేదని, 811 టీఎంసీ కృష్ణా జలాలలో సరైన వాటా కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్మార్ట్ సిటీ లో వరంగల్ మరియు కరీంనగర్, హైదరాబాద్ కు ఇండస్ట్రియల్ కారిడార్ ఏది అడిగినా ఇవ్వలేదన్నారు.

తెలంగాణా భవన్ లో గాడిద గుడ్డు .. ఇందుకే
నారాయణపేట హ్యాండ్లూమ్ పార్క్, ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, ITIR & ఇండస్ట్రియల్ పార్కులు, నవోదయ & కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు ఏది అడిగినా బిజెపి చేయలేదని, తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ బిజెపి ఇచ్చింది ఇది అని పేర్కొంది. ఇక అటువంటి బీజేపీని ఎలా ఆదరిస్తారని తమ చర్య ద్వారా కాంగ్రెస్ ప్రజల్ని ఆలోచించేలా చేస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+