Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ కలవడు.!మమ్మల్ని కలవనివ్వడు.!బాసర సమస్య ఎలా పరిష్కారం అవుతుందంటూ సీఎంకు రేవంత్ లేఖాస్త్రం.!

హైదరాబాద్ : బాసర ఐఐఐటీలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి సీఎం చంద్రశేఖర్ రావు వెళ్లరు.. తమ లాంటి వారిని వెళ్లి సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకురావాలనుకుంటే హైదరాబాద్ నుంచి బాసర వరకు అణువణునా పోలీసులను మొహరించి అరెస్టులకు పాల్పడుతారని తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం చంద్రశేఖర్ రావు పై మండిపడ్డారు. ఇటువంటి నిర్భంద పరిస్థితుల్లో విద్యార్ధులు ఎండకు ఎండుతూ వానకు తడస్తూ అంకుఠిత దీక్షతో తమ ఆందోళనను కొనసాగిస్తుంటే వాళ్ల సమస్యలు సిల్లీ అంటూ విద్యా శాఖ మంత్రి హేళనగా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.

 బాసర విద్యార్ధుల సమస్యలు పరిష్కరించండి..

బాసర విద్యార్ధుల సమస్యలు పరిష్కరించండి..

మరో వైపు మంత్రి కేటీఆర్, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని జూన్ 15న ట్వీట్ చేశారని, ఇది చెప్పి కూడా 5 రోజులు దాటిపోయందని, ఎటువంటి అతీగతీ లేదంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసారు.లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం లక్షల ఉద్యోగాలు ఇచ్చాం అని సూటు బూటు వేసుకొని పారిశ్రామికవేత్తలతో ఫోటోలు దిగడంకాదని, గత ఎనిమిదేళ్లుగా తెలంగాణలో ఒక ఉన్నత విద్యా సంస్థ రాకుండా, విద్యార్థులకు ఉన్నత విద్య అందని పరిస్థితిల్లో మీరు చెబుతున్న లక్షల ఉద్యోగాలకు అవసరమైన అర్హత ఎక్కడ నుంచి విద్యార్ధులకు లభిస్తుందని ప్రశ్నించారు రేవంత్.

 బాసర ఐఐఐటీ న్యాక్ దృష్టిలో సి గ్రేడ్ ర్యాంకుకు పడిపోయింది..

బాసర ఐఐఐటీ న్యాక్ దృష్టిలో సి గ్రేడ్ ర్యాంకుకు పడిపోయింది..

గులాబీ ప్రభుత్వ నిర్వాకం మూలంగా ప్రతిష్టాత్మకమైన బాసర ఐఐఐటీ న్యాక్ దృష్టిలో సి గ్రేడ్ ర్యాంకుకు పడిపోయిందని, న్యాక్ గ్రేడ్‌ ఆధారంగానే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో మల్టీ నేషనల్‌ కంపెనీలు పాల్గొనడంతోపాటు యూజీసీ నుంచి పరిశోధనలకు నిధులు వస్తాయని లేఖలో రేవంత్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ఇవన్నీ నిలిచి పోయే ప్రమాదం ఏర్పడిందని, ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ యువతకు లక్షల ఉద్యోగాలు ఏటు నుంచి వస్తాయన్నారు రేవంత్. దాదాపు 8 వేల మంది విద్యార్థులు అందోళన చేస్తుంటే, భోజనం పెట్టబోమని హెచ్ఓడీలు బెదిరింపులకు పాల్పపడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

 మంత్రులు విద్యార్థుల ఉద్యదమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు..

మంత్రులు విద్యార్థుల ఉద్యదమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు..

మరో వైపు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో జరిపిన చర్చలు సఫలం అయ్యాయని, సోమవారం నుంచి విద్యార్ధులు తరగతులకు హాజరవుతారని, సమస్యను పక్క దారి పట్టించే ప్రయత్నం చేశారని రేవంత్ మండిపడ్డారు. విద్యార్ధులు ఆగ్రహించడంతో ఆ ప్రకటనను వెనక్కితీసుకున్నారని, సోమవారం కూడా విద్యార్ధుల ఆందోళనలు అలాగే కొనసాగుతున్నాయని, మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, కలెక్టర్ చర్చలు జరుపుతున్నా విద్యార్ధులు నమ్మడం లేదన్నారు రేవంత్. రాత పూర్వక హామీ కావాలని పట్టుబడుతున్నారని, ఇంత జరుగుతుంటే వేగంగా స్పదించాల్సిన సీఎం అసలు రాష్ట్రంలో ఉన్నారో లేదో తెలియని సందేహాలు నెలకొన్నాయన్నారు రేవంత్ రెడ్డి.

విద్యార్థుల న్యాయమైన డిమాండ్లు..

విద్యార్థుల న్యాయమైన డిమాండ్లు..

ఈ నేపథ్యంలో విద్యార్ధులు కోరుకున్న డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలన్నారు రేవంత్. లేని పక్షంలో నిరుద్యోగ గర్జన కంటే భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విద్యార్ధుల పక్షాన ఉద్యమిస్తుందని రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్ధుల డిమాండ్లు:1)తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ వర్సిటీని సందర్శించాలి. 2)రెగ్యులర్‌ వీసీని నియమించాలి.

ఆయన క్యాం పస్‌లోనే ఉండాలి. 3)విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకుల సంఖ్యను పెంచాలి.4)ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ ఆధారిత విద్యను అందించాలి. 5)ఇతర వర్సిటీలు, సంస్థలతో వర్సిటీని అనుసంధానం చేయాలి. 6)తరగతి, హాస్టల్‌ గదులకు మరమ్మతులు చేయాలి. 7)ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్, మంచాలు, బెడ్లు అందించాలి. 8)మెస్‌ల మెయింటెనెన్స్‌ మెరుగ్గా ఉండేలా చూడాలి.9)పీడీ, పీఈటీలను నియమించి క్రీడలనూ ప్రోత్సహించాలి.ఈ డిమాండ్లను తక్షణం పరిష్కరించాలన్నారు రేవంత్ రెడ్డి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+