పుష్కరాలపై సమీక్ష: 'కార్మికుల సమ్మె వెనుక ఆంధ్రా పార్టీల కుట్ర'
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తమకు ప్రభుత్వం 47 శాతం వేతనాలు పెంచినందుకుగాను జీహెచ్‌ఎంసీ కార్మికులకు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు శుక్రవారం కార్మిక నేతల ఆధ్వర్యంలో సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎంకు మిఠాయిలు తినిపించారు. కేసీఆర్‌కు తమ జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. మరింత ఉత్సాహంగా మరిన్ని ఎక్కువ గంటలు పని చేసేందుకు సిద్దంగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఆదాయం పెరిగితే అడకుండానే జీతాలు పెంచుతామని కేసీఆర్ కార్మికులకు చెప్పారు.

జీతాల పెంపు క్రెడిట్ తమకే దక్కాలని కొన్ని సంఘాలు కార్మికులను తప్పుదోవ పట్టించాయిని విమర్శించారు. రంజాన్, బోనాలు, పుష్కరాల సమయంలో సమ్మె చేయడం కార్మికులకు గౌరవంగా ఉంటుందా? అని ప్రశ్నించారు. కార్మికుల సమ్మె వెనుక ఆంధ్రా పార్టీలు, నేతల హస్తం ఉన్న విషయం తనకు తెలుసునని అన్నారు.
గోదావరి పుష్కరాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రేపు, ఎల్లుండి సెలవు దినాలు కావడంతో పుష్కర స్నానం చేసే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ధర్మపురిలో ఇప్పటి వరకు సుమారు 4 లక్షల మందికిపైగా భక్తులు పుష్కర స్నానం చేశారని పేర్కొన్నారు. ఇతర ఘాట్లలోనూ లక్షల సంఖ్యలో పుష్కర స్నానాలు చేస్తున్నారని తెలిపారు. భద్రాచలంతో సహా ఇతర పుష్కర స్నానాలు ఆచరించే ప్రదేశాలను హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షించాలని డీజీపీ అనురాగ్ శర్మని ఆదేశించారు.
శని, ఆదివారాల్లో పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో పుష్కర ఏర్పాట్ల పర్యవేక్షణకు వెళ్లాలని మంత్రులను ఆదేశించారు. ఈ సమావేశానికి సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మతోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications