డబుల్​ ఆర్​ ట్యాక్స్​ వసూళ్లు: మోడీకి కేసీఆర్ సవాల్

కొత్తగూడెం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కొత్తగూడెంలో జరిగిన రోడ్​ షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మహబూబాబాద్​, ఖమ్మం పార్లమెంటు అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. మహబూబాబాద్ లోక్​‌సభ​ నుంచి మాలోతు కవితను, ఖమ్మం లోక్​సభ నుంచి నామ నాగేశ్వరరావును గెలిపించాలని కేసీఆర్​ కోరారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్​, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్​ ఆర్​ ట్యాక్స్​ పేరుతో వసూలు చేస్తోందని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ.. మరి ఎందుకు ఈడీ, ఐటీలతో విచారణ జరిపించడం లేదని నిలదీశారు. వెంటనే ఈ విషయంపై ఈడీ, ఐటీ సంస్థలను మోడీ రంగంలోకి దించాలని డిమాండ్​ చేశారు కేసీఆర్.

Double R tax in telangana comments KCR questions pm modi

బీఆర్​ఎస్​ పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేశామని కేసీఆర్​ అన్నారు. కాంగ్రెస్​, బీజేపీ రెండూ ఒకటేనని వ్యాఖ్యానించారు. వీరిద్దరిలో ఎవరికి ఓటేసిన గోదావరిలో వేసినట్లు తప్పా రాష్ట్రానికి ఏం లాభం లేదన్నారు. కొత్తగూడెంలోనే ఎక్కువగా పోడు పట్టాలను అందించామని తెలిపారు. అలాగే రైతుబంధు, రైతుబీమాలను కల్పించామన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుబంధు ఎవరికైనా వచ్చిందా? అని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్​ఎస్​ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విన్నవించారు కేసీఆర్. ఈసారి ఖచ్చితంగా బీఆర్​ఎస్​ గెలిస్తేనే తెలంగాణ నదుల నీళ్లు తెలంగాణకు దక్కుతాయన్నారు. కాంగ్రెస్​ కథ ముగిసిపోయిందని, బీజేపీ కథ కూడా కంచెకే అని వ్యాఖ్యానించారు. బీఆర్​ఎస్‌ అభ్యర్థులను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని కేసీఆర్​ ఓటర్లను కోరారు. తెలంగాణలో బీఆర్ఎస్ 12 సీట్లను గెలవబోతోందన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తే బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+