పెరిగిన వాహనాలు: ఓలా కార్యాలయంపై డ్రైవర్ల దాడి, బౌన్సర్లను చితకబాదారు

భాగ్యనగరంలోని కూకట్‌పల్లి ఓలా సర్వీస్ కార్యాలయం వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యాలయం పైన పలువురు డ్రైవర్లు దాడికి పాల్పడ్డారు.

హైదరాబాద్: భాగ్యనగరంలోని కూకట్‌పల్లి ఓలా సర్వీస్ కార్యాలయం వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యాలయం పైన పలువురు డ్రైవర్లు దాడికి పాల్పడ్డారు. ఓలా క్యాబ్‌లు పెరగడం వల్ల ఆదాయం పడిపోయిందని వారు ఆందోళన చేపట్టారు.

డ్రైవర్లు ఓలా కార్యాలయం అద్దాలు పగలగొట్టి, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఓలా కార్యాలయ సిబ్బంది, బౌన్సర్లు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

 Drivers attack on Ola office in Hyderabad

కాగా, తొలుత డ్రైవర్లు తమ సమస్యలను యాజమాన్యానికి చెప్పుకునేందుకు వెళ్లగా.. బౌన్సర్లు దాడి చేశారని అంటున్నారు. దీంతో ఆగ్రహించిన డ్రైవర్లు.. బౌన్సర్లను చితకబాదారని చెబుతున్నారు.

పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను శాంతింప చేశారు. డ్రైవర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, గత కొద్ది రోజులుగా వాహనాల సంఖ్య బాగా పెరిగింది.

ఓలా క్యాబ్స్ ఇచ్చిన వాహనాలు సరిగ్గా నడవకపోవడం, అదే విధంగా డ్రైవర్లు డబ్బులు సరిగ్గా చెల్లించక పోవడంతో యాజమాన్యం ఒత్తిడి తీసుకొచ్చిందని అంటున్నారు. ట్రిప్పుల విషయంలో తేడా వచ్చిందని ఓనర్లు చెబుతున్నారు. సుమారు వెయ్యి మంది డ్రైవర్లు కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+