హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రంకన్ డ్రైవ్: ముప్పుతిప్పలు పెట్టిన లేడీ డాక్టర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో పోలీసులు శుక్రవారం డ్రంకన్ డ్రైవ్ చేపట్టారు. మద్యం తాగి కారు నడుపుతూ వారికి ఓ మహిళా డాక్టర్ పట్టుబడ్డారు. అయితే మహిళా డాక్టర్ పోలీసులతో వాగ్వాదిగి ముప్పుతిప్పలు పెట్టా. అంతేగాక, బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌కు కూడా ఆమె అంగీకరించలేదు.

ఆమె తన కారును రోడ్డుపైనే విడిచిపెట్టి కిలో మీటరు వరకు నడుచుకుంటూ వెళ్లిపోయింది. పట్టువదలని విక్రమార్కుడిలా ట్రాఫిక్ పోలీసులు కూడా ఆమె వెంటపడ్డారు. మద్యం తాగారో లేదో టెస్ట్ చేద్దామంటే ఆమె అందుకు సహకరించలేదు.

దీంతో ఓ మహిళా పోలీసు గంటపాటు శ్రమించి ఆమెను బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయించారు. కాగా, ఆమె ఎక్కువ మోతాదులోనే మద్యం సేవించినట్లు తేలింది. ఆమె కారు నడిరోడ్డుపై పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ జాం కోవడంతో కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Drunk and Drive: A case filed on a lady doctor

మహిళా వైద్యురాలిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డంక్ అండ్ డ్రైవ్ కేసులో మరో మూడు కార్లను, మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో 4కిలోల బంగారం పట్టివేత

నగరంలోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో 4కిలోల బంగారాన్ని శనివారం ఉదయం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మస్కట్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానంలో బంగారం లభ్యమైనట్లు అధికారులు చెప్పారు. బంగారాన్ని సీటులోనే వదిలి నిందితుడు పరారయ్యాడని తెలిపారు. నిందితుడి కోసంగా డిఆర్ఐ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

English summary
Hyderabad Traffic Police on Friday night filed a case on a woman doctor in Drunk and Drive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X