ప్రియుడ్ని నమ్మి.. ఫేస్‌బుక్ లో నగ్నంగా వీడియో చాట్ చేస్తే.. అతడేం చేశాడో తెలుసా?
తెలంగాణ లోని నకిరేకల్ మండలానికి చెందిన యువతికి ఫేస్‌బుక్‌లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువకుడు పరిచయమయ్యాడు. అతడు దుబాయ్ లో ఉంటూ.. ఆమెతో ఫేస్‌బుక్ ద్వారా చాటింగ్ చేసేవాడు.
హైదరాబాద్: 'నాతో వీడియో చాట్ చేసేటప్పుడు నువ్వు నగ్నంగా ఉండాలి..' అన్నాడా ప్రియుడు. కాబోయే మొగుడు.. బాధపెట్డడం ఎందుకని ఆ యువతి అలాగే చేసింది. తీరా చూస్తే.. ప్రియుడే షాక్ ఇచ్చాడు.
ఫేస్‌బుక్‌లో వీడియో చాట్ చేస్తుండగా ఆమె నగ్నరూపాన్ని వీడియోతీసి ఏకంగా నెట్టింట్లో పెట్టేశాడు. షాక్ తిన్న ఆ యువతి నేరుగా పోలీసులను ఆశ్రయించింది. ఇదెక్కడో విదేశాల్లో జరిగింది కాదు. మన దేశంలోనే.. ఆ మాటకొస్తే తెలంగాణలోనే జరిగింది.

వివరాల్లోకి వెళితే... తెలంగాణ లోని నకిరేకల్ మండలానికి చెందిన యువతికి ఫేస్‌బుక్‌లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువకుడు పరిచయమయ్యాడు. అతడు దుబాయ్ లో ఉంటూ.. ఆమెతో ఫేస్‌బుక్ ద్వారా చాటింగ్ చేసేవాడు.
మొదట్లో ఉన్న స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. దుబాయ్‌లోని ఓ కంపెనీలో జాబ్ చేస్తున్న ఆ యువకుడు చాటింగుల్లో... 'నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లిచేసుకుంటాను..' అంటూ వెంటపడేవాడు.
మంచి ఉద్యోగంలో ఉన్నాడు, పైగా దుబాయ్ఋలో ఉంటున్నాడు.. అతడ్ని పెళ్లాడితే తన జీవితమూ బాగుంటుదని భావించిన యువతి.. అతడితో జీవితం పంచుకోవడానికి ఒప్పుకుంది. ఆ తరువాత నుంచి ఇద్దరూ మరింత క్లోజ్ అయిపోయారు.
అతడి మైకంలో పడిన ఆమె.. అతడు చెప్పిందల్లా చేస్తూ వచ్చింది. ఫేస్ బుక్ లో వీడియో చాటింగ్ చేస్తూ.. తన ముందర నగ్నంగా నిలబడాలంటూ అతడు కోరగా.. ప్రియుడ్ని బాధపెట్టడం ఇష్టం లేక.. నగ్నంగా మారి అతడితో చాటింగ్ చేసిందామె.
అదే అదనుగా అతడు.. ఆమె నగ్న వీడియోలను రికార్డ్ చేశాడు. అంతటితో ఊరుకోకుండా వాటిని ఇంటర్నెట్ లో పెట్టి ఆ విషయం ఆమెతోనే చెప్పేశాడు. దీంతో ఏనాటికైనా అతడితో ప్రమాదమే అని భావించిన ఆమె నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె ప్రియుడు దుబాయ్ నుంచి వచ్చేంత వరకు వేచి చూసి.. ముంబై విమానాశ్రయానికి చేరుకోగానే అరెస్టు చేసి జైలుకు పంపించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications