దుబ్బాక దంగల్: కమలం హవా కంటిన్యూ.. 2 వేల ఓట్ల లీడ్‌లో బీజేపీ

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో బీజేపీ లీడ్‌లో కొనసాగుతోంది. తొలి రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో కనిపించారు. ఇక్కడ మొత్తం 23 రౌండ్లను లెక్కిస్తారు. 4 రౌండ్లు ముగియడంతో.. మరో 19 రౌండ్లు లెక్కించాల్సి ఉంది. సిద్దిపేట ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలోని డీ బ్లాక్‌ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 3208 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ సుజాతకు 2867 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డికి 648 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్‌లో బీజేపీ 341 ఓట్ల లీడ్ సాధించింది. రెండో రౌండ్‌లో బీజేపీకి 1561 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థికి 1282 ఓట్లు వచ్చాయి. రఘునందన్ రావుకు 279 ఓట్ల ఆధిక్యం వచ్చింది. రెండు రౌండ్ల వారీగా చూస్తే బీజేపీకి 4769, టీఆర్ఎస్ 4149, కాంగ్రెస్ 922 ఓట్లు వచ్చాయి. మొత్తంగా రఘునందన్ రావు 620 ఓట్ల లీడ్‌లో ఉన్నారు.

Dubbaka Bypoll: BJP candidate Raghunandan Rao shows clear lead over TRS and Congress

మరో రెండు రౌండ్లలోనూ బీజేపీ లీడ్‌లో ఉంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 13 వేల 55 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు 10 వేల 375 ఓట్లతో రెండోస్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది. రఘునందన్-సుజాత మధ్య తేడా 2 వేల 680 ఓట్ల తేడా ఉంది. ఐదో రౌండ్‌లో బీజేపీకి 3462 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ 3126, కాంగ్రెస్ 566 ఓట్లు వచ్చాయి. ఐదో రౌండ్ పూర్త‌య్యేసరికి బీజేపీ-16,517, టీఆర్ఎస్ 13,497, కాంగ్రెస్ 2724 ఓట్లతో ఉన్నాయి.

Recommended Video

    DubbakaBypollresult Roundup : దుబ్బాకలో మారిపోతున్న అంచనాలు - ఉత్కంఠగా ఓట్ల లెక్కింపు

    5వ రౌండ్ పూర్తయ్యేసరికి 3 వేల 20 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది. ఇక ఆరో రౌండ్‌లో బీజేపీకి కాస్త ఓట్లు తగ్గాయి. బీజేపీకి 3709, టీఆర్ఎస్ పార్టీకి 4062, కాంగ్రెస్ 530 వచ్చాయి. ఇక మొత్తంగా చూస్తే బీజేపీకి 20, 226 ఓట్లు, టీఆర్ఎస్ 17559 ఓట్లు, కాంగ్రెస్ 3254 ఓట్లు వచ్చాయి. అయినా బీజేపీ 2667 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఇక 9వ రౌండ్‌లో బీజేపీ 3413, టీఆర్ఎస్ 2329 కాంగ్రెస్ 675 ఓట్ల చొప్పున వచ్చాయి. మొత్తంగా బీజేపీకి 29,291 టీఆర్ఎస్ 25,101, కాంగ్రెస్ 5800 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ 4 వేల 190 ఓట్ల లీడ్‌లో ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+