ప్రధాని మోడీ పర్యటన వేళ కేటీఆర్ మార్క్ షాక్!!
దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నవేళ షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు తెలంగాణ మంత్రి కేటీఆర్. అదే రోజు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే బండి సంజయ్ అరెస్ట్ తో బీజేపీ నేతలకు షాక్ ఇచ్చిన తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు దేశ ప్రధాని పర్యటనను టార్గెట్ చేస్తుంది. కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పదేపదే టార్గెట్ చేస్తున్న మంత్రి కేటీఆర్ మోడీ ప్రోగ్రాం ని కూడా టార్గెట్ చేశారు.
ఒకపక్క బండి సంజయ్ ను పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించిన సమయంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉండకపోవచ్చని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులకు ఏప్రిల్ 8వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు.

ఇక ఈ క్రమంలో మోడీని టార్గెట్ చేసిన మంత్రి కేటీఆర్ షాక్ ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8వ తేదీన ఆందోళనలకు పిలుపునిచ్చారు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామగుండం సాక్షిగా సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు పరం చేయబోమని చెప్పి మాట తప్పారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. లాభాలలో ఉన్న సింగరేణిని ప్రైవేటీకరించవలసిన అవసరం ఏమిటో చెప్పాలని ఆయన నిలదీశారు.
సింగరేణి బొగ్గు గనులు ఉన్న ప్రాంతాలైన భూపాలపల్లి, మంచిర్యాల, కొత్తగూడెం, రామగుండం కేంద్రాలలో మహాధర్నాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో తెలంగాణా రాష్ట్ర డిమాండ్ లను కేంద్రానికి తెలియజేయాలని భావించారు. దీంతో ఈనెల 8వ తేదీన తెలంగాణలో మోడీ పర్యటనకు షాక్ ఇచ్చేలా ఆందోళనలు కొనసాగనున్నాయి.












Click it and Unblock the Notifications