కాశ్మీర్‌లో డైనమిక్ కలెక్టర్ ఆమ్రపాలి పెళ్లి: చెల్లితో దిగిన ఫోటో పోస్ట్ వైరల్
వరంగల్/శ్రీనగర్: వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి వివాహం ఆదివారం జమ్ము కాశ్మీర్‌లో జరిగింది. 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సమీర్ శర్మతో ఆమె పెళ్లి నిశ్చయమైన విషయం తెలిసిందే. ఈ నెల 23న వరంగల్‌లో, 25న హైదరాబాదులో మిత్రులు, ప్రజాప్రతినిధులకు ఆమె విందు ఇవ్వనున్నారు.
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆమ్రపాలి చురుకైన పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. జమ్ము కాశ్మీర్‌కు చెందిన యువ ఆఫీసర్ సమీర్ శర్మతో ప్రేమ కొనసాగించిన ఆమ్రపాలి.. వివాహానికి ఇరువర్గాల పెద్దలను ఒప్పించారు.

మార్చి 7 వరకు హనీమూన్ ట్రిప్
భర్తతో కలిసి ఈ నెల 22వ తేదీ వరకు కాశ్మీర్‌లో ఉండనున్నారు. ఆ తర్వాత వరంగల్ తిరిగి రానున్నారు. వరంగల్, హైదరాబాదులలో మిత్రులకు, ప్రముఖులకు, విందు ఇచ్చిన తర్వాత ఆమె మార్చి 7వ తేదీ వరకు టర్కీలో హనీమూన్ ట్రిప్ గడపనున్నారు.
చెల్లితో కలిసి ఫోటో ట్విట్టర్‌లో పోస్ట్
శనివారం (ఫిబ్రవరి 17) మెహందీ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. వివాహ వేడుకలో భాగంగా తన సోదరితో కలిసి దిగిన ఫోటోను ఆమ్రపాలి సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసి, తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇది వైరల్ అవుతోంది.

ఆమ్రపాలి కాటా
విశాఖపట్నంకు చెందిన వెంకట రెడ్డి కాట.. ఆమ్రపాలి తండ్రి. ఆయన ఏయూలో ప్రొఫెసర్‌గా పని చేసి పదవీ విరమణ పొందారు. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండే ఆమ్రపాలి.. ఐఐటీ మద్రాస్ నుంచి సివిల్ ఇంజనీర్‌లో బీటెక్ చేశారు. బెంగళూరు ఐఐఎం నుంచి పీజీ డిప్లోమా పట్టా అందుకున్నారు. ఐఏఎస్ కాకముందు జూనియర్ రిలేషన్‌షిప్ బ్యాంకర్‌గా పని చేశారు.

ఆమ్రపాలి ఏం చేసినా చర్చనీయాంశమే
2010లో సివిల్స్ రాసి 39వ ర్యాంకు సాధించారు. సొంత రాష్ట్ర కేడర్‌లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. 2014లో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మహిళా శిశు సంక్షేమ విభాగానికి మారారు. 2016లో కేసీఆర్ ప్రభుత్వం ఆమెను వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా నియమించింది. ఆమ్రపాలి ఏం చేసినా చర్చనీయాంశంగా మారే పరిస్థితి ఉంది.

సినీ తారలకు ఉండే ఫాలోయింగ్
రాజకీయ నాయకులకు, సినీ తారలకు ఉండే ఫాలోయింగ్ ఆమెకు ఉంది. పనిలోను, తన జీవితంలోను ప్రత్యేకత కనబర్చుతారు. సంప్రదాయ చీరకట్టులో, మోడ్రన్ దుస్తుల్లోను కనిపిస్తారు. ఆమె గతంలో ట్రెక్కింగ్ కూడా చేశారు. స్థానికంగా ఉన్న పర్యాటక ప్రదేశాలను వార్తల్లోకి తీసుకు రావడం కోసం ఆమె అలా చేశారు.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications