బతుకమ్మ చీరలకు చెక్...! రైతు బందు చెక్కులపై కారు చీకట్లు..!!
హైదరాబాద్:రైతు చేతుల్లో చెక్ లు పెట్టి ఎన్నికలకు వెళ్లాలన్న తెలంగాణ ఆపధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వ్యూహాం బెడిసికొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరువేల కోట్ల రూపాయలను అధికారికంగా పంచిన క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని చంద్రశేఖర్ రావు చేసిన ప్రయత్నాలకు చెక్ పడే అవకాశాలున్నాయి. దూర ద్రుష్టితో ఆలోచించి ముందస్తు ఎన్నికలకు సన్నాహాలు చేసుకున్న చంద్రశేఖర్ రావుకు ఎన్నికల సంఘం రూపంలో అడ్డుకట్ట ఎదురైంది. బతుకమ్మ చీరల పంపిణికి ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో ఇప్పుడు రైతు బంధు స్కీం మీద నీలినీడలు కమ్ముకున్నాయి. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని కోటి మందికి కోటి చీరలను ఉచితంగా అందజేయడానికి ఏర్పాట్లు జరిగాయి.
Recommended Video


రైతు బంధు స్కీం మీద నీలినీడలు..! మోకాలడ్డుతున్న ఈసీ..!!
కాగా గత యేడాది నుంచి ఈ స్కీం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. అయితే పోయిన యేడాది ఇచ్చిన చీరలపైన తీవ్ర విమర్శలొచ్చాయి. నాసిరకం స్కిల్ చీరలు ఇచ్చారంటు చాలా చోట్ల మహిళలు అసంత్రుప్తి వ్యక్తం చేశారు. చీరలను తగలబెట్టి తమ నిరసనను తెలియజేశారు. దీంతో ఈ సారి ప్రభుత్వం జాగ్రత్త పడింది. సిరిసిల్లలో ప్రత్యేకంగా చీరలను నేయించి పంపణికి సిద్ధం చేశారు. కాని ఈసీ నిర్ణయంతో బతుకమ్మ చీరలను గోదాములకే పరిమితం కావాల్సి వచ్చింది. చీరల విషయాన్ని ఎన్నికల సంఘం ఇంత సీరియస్ వ్యవహారిస్తే ఇక ఎకరానికి నాలుగువేల రూపాయలను నేరుగా అందించే రైతు బంధు స్కీం అమలు కావడం కష్టమేనని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

నగదు రూపంలో రూపంలో చెక్కుల పంపిణీ.. ! ఈసీ అభ్యంతరం చెప్పే అవకాశం..!!
నగదు రూపంలో రైతులకు లబ్ది జరుగుతున్న నేపథ్యంలో ఈసీ కచ్చితంగా అనుమతి ఇవ్వకపోవచ్చునని భావిస్తున్నారు. ఇదే జరిగితే అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే. రైతు బంధు కొత్త పథకం కాదు కాబట్టి చెక్ ల పంపిణికి ఈసీ అనుమతి ఇవ్వాల్సిందేనని టీఆర్ఎస్ వర్గాలు వాదిస్తున్నాయి. స్కీం ప్రకటించినప్పుడే రెండు దశ చెక్ లు నవంబర్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినందున కోడ్ ఉల్లంఘన ఏ మాత్రం కాదని గులాబీ నేతలు వాదిస్తున్నారు. అయితే ఈ వాదనను ఈసీ ఎంత మేరకు పరిగణనలోకి తీసుకుంటుందో చూడాల్సిందే.

కేసీఆర్ వ్యూహాలకు ఈసీ అడ్డుకట్ట..!తప్పు ప్రతిపక్షాలదంటున్న గులాబీ దళం..!!
మరో వైపు బతుకమ్మ చీరల పంపిణి, రైతు బంధు స్కీం పైన ఈసీకి ఫిర్యాదుల చేయడంపైన టీఆర్ఎస్ మండిపడుతోంది. ఆడపడచులకు పండగ పూట కొత్త చీరలు అందకుండా మహకూటమి అడ్డుకుందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రైతు బంధు స్కీంను కూడా అడ్డుకుంటే తెలంగాణ రైతుల సహించరని వారంటున్నారు. అయితే మహాకూటమి మాత్రం ఈ వ్యవహారంతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి ముందస్తు వ్యవహారంలో కేసీఆర్ వ్యూహానికి ఈసీ అడ్డుకట్ట వేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది.

మహాకూటమి పై కేసీఆర్ చిందులు..! తీవ్ర స్థాయిలో విమర్శలు..!!
టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు మహాకూటమి ఏర్పాటు ప్రయత్నాలపైన విరుచుకుపడ్డారు. ప్రధానంగా తెలుగుదేశం, కాంగ్రెస్ పొత్తుపైన ఆయన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. థూ...తెలుగుదేశంతో పొత్తా అంటు కాంగ్రెస్ ను ఆయన ఈసడించుకున్నారు. మళ్ళీ తెలంగాణను చంద్రబాబు చేతిలో పెడతారా అంటు కేసీఆర్ కాంగ్రెస్ ప్రశ్నించారు. తెలంగాణ పైన అమరావతి, ఢిల్లీ పెత్తనం ఉండాలా అని ఆయన వ్యాఖ్యానించారు. మరో వైపు పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపైన కూడా కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను బట్టెబాజీ అని ఆయన వ్యాఖ్యానించడంపైన టీఆర్ఎస్ అధినేత అభ్యంతరం వ్యక్తం చేశారు.
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications