ఈసీ సంచలనం: తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌పై సస్పెన్షన్ వేటు, రేవంత్‌తో భేటీ ఎఫెక్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌పై ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఈసీ. రేవంత్ రెడ్డిని కలవడంపై డీజీపీ నుంచి వివరణ కోరింది. ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న సమయంలో ఈసీ నిర్ణయం సంచలనంగా మారింది.
అంజనీకుమార్ తోపాటు రేవంత్ రెడ్డిని కలిసిన మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు ఈసీ నోటీసులు జారీ చేసింది. అదనపు డీజీలు మహేశ్ భగవత్, సంజయ్ జైన్‌లకు నోటీసులు పంపింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

అంజనీకుమార్ తోపాటు రేవంత్ రెడ్డిని కలిసిన మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు ఈసీ నోటీసులు జారీ చేసింది. అదనపు డీజీలు మహేశ్ భగవత్, సంజయ్ జైన్‌లకు నోటీసులు పంపింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక డీజీపీ స్థానంలో అర్హతలున్న వ్యక్తిని నియమించాలని ఆదేశించింది.
కాగా, అసెంబ్లీ ఎన్నికలు వెలువడుతుండగానే డీజీపీగా ఉన్న అంజనీకుమార్, ఇతర ఉన్నతాధికారులు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడంతో రేవంత్ రెడ్డికి శుభకాంక్షలు తెలిపారు. అంతేగాక, ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు 2+2 సెక్యూరిటీ అందించాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. ఇక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన విషయాలపైనా రేవంత్ రెడ్డితో చర్చించినట్లు సమాచారం. ఎల్పీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉందని చెప్పారు. అందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అంతలోనే ఈసీ నిర్ణయం సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications