హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ రండి.. ప్రచారంలో ఉన్నా: ఐటీ అధికారులకు రేవంత్, ముఖంలో లేని టెన్షన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/కొడంగల్: హైదరాబాద్‌కు రావాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆదాయపన్ను, ఈడీ అధికారులు గురువారం ఆదేశాలు జారీ చేశారు. అధికారుల ఆదేశాల నేపథ్యంలో ఆయన కొడంగల్ నుంచి బయలుదేరనున్నారు. అయితే ప్రస్తుతం తాను ప్రచారంలో ఉన్నందున కాస్త ఆలస్యమవుతుందని అధికారులకు చెప్పారని తెలుస్తోంది.

<strong>'ఇక్కడి నుంచి ఉత్తరాలు, ఢిల్లీ నుంచి ఆధికారులు, అందుకే రేవంత్ ఇంటిపై ఐటీ దాడులు'</strong>'ఇక్కడి నుంచి ఉత్తరాలు, ఢిల్లీ నుంచి ఆధికారులు, అందుకే రేవంత్ ఇంటిపై ఐటీ దాడులు'

ఓ వైపు తన ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు జరుగుతున్న సమయంలో రేవంత్ ప్రచారంలో ఉన్నారు. వీటిని ఆయన తేలిగ్గా తీసుకున్నారని అంటున్నారు. తన వద్ద ఎలాంటి అక్రమాలు లేకపోవడంతోనే ఆయన ధీమాగా ఉన్నారని అంటున్నారు. ఆయన వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం మదనపల్లిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

రేవంత్‌కు ఘన స్వాగతం

రేవంత్‌కు ఘన స్వాగతం

రేవంత్ రెడ్డి రాకతో గ్రామంలోని అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్‌కు ఘన స్వాగతం పలికారు. ఈడీ సోదాలపై ఏమాత్రం ఆందోళన లేకుండా ఆయన కనిపించారని అంటున్నారు. ఆయన ప్రచారం మదనపల్లి నుంచి బురాన్ పూర్, బొంరాస్ పేట మీదుగా మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండలం పోలేపల్లి వరకు సాగుతుందని చెబుతున్నారు.

రేవంత్ మనీలాండరింగ్‌పై ఉప్పందించిన లాయర్ ఇతనే

రేవంత్ మనీలాండరింగ్‌పై ఉప్పందించిన లాయర్ ఇతనే

రేవంత్ రెడ్డిపై మనీ లాండరింగ్ ఆరోపణల మీద ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించి ఓ లాయర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు చేసిన లాయర్ పేరు రామారావు. ఆయన ఇచ్చిన ఫిర్యాదే కీలకంగా మారిందని తెలుస్తోంది.

నిధులు మళ్లించారని రేవంత్ పైన ఫిర్యాదు

నిధులు మళ్లించారని రేవంత్ పైన ఫిర్యాదు

ఇటీవల సీబీఐకి రామారావు ఫిర్యాదు చేస్తూ... రేవంత్ బంధువు జయప్రకాశ్ తదితరులు 10 నుంచి 15 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి రూ. 300 కోట్లకు పైగా నిధులను మళ్లించారని ఆరోపించారు. సాయిమౌర్య ఎస్టేట్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ తరఫున మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్, జూబ్సీహిల్స్ పరిధిలోని ఇంటి నంబర్ 346 చిరునామాతో ఈ కంపెనీలు ఉన్నాయని ఆయన ఉప్పందించగా, ఈ ఫిర్యాదును పరిశీలించాలని సీబీఐ నుంచి ఈడీకి ఆదేశాలు వెళ్లిందని తెలుస్తోంది.

 సెబాస్టియన్ ఇంట్లో ఐటీ సోదాలు

సెబాస్టియన్ ఇంట్లో ఐటీ సోదాలు

ఇదిలా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులోని ఏ 2 నిందితుడు సెబాస్టియన్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 45లోని భోపాల్ ఇన్‌ఫ్రా ఆఫీసులో సోదాలు చేశారు.

English summary
ED and IT officers call Telangana Congress leader and Kodangal former MLA Revanth Reddy to attend inquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X