హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాయితీ కందిపప్పు: రూ. 135కే పంపిణీ, క్యూ కట్టిన ప్రజలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కందిపప్పు అక్రమంగా నిల్వ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. పోలీసులు, విజిలెన్స్ అధికారుల ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో అక్రమ నిల్వలపై దాడులు కొనసాగుతున్నాయన్నారు.

పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శనివారం ఆయన ఎర్రగడ్డ రైతుబజార్‌లో ఏర్పాటు చేసిన రాయితీ కందిపప్పు విక్రయ కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ అక్రమ నిల్వల సమాచారాన్ని తెలియజేయాలని ప్రజలకు సూచించారు.

రాయితీ కందిపప్పు: రూ. 135కే పంపిణీ, క్యూ కట్టిన ప్రజలు

రాయితీ కందిపప్పు: రూ. 135కే పంపిణీ, క్యూ కట్టిన ప్రజలు

అర్హులకు కందిపప్పు పంపిణీ చేయకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలించే రేషన్ డీలర్లపైనా కొరడా ఝుళిపిస్తామని స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితులతో రూ.70 - 80 ఉండాల్సిన కిలో కందిపప్పు ధర సామాన్యుడికి అందుబాటులో లేకుండా రూ.200 దాటిందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాయితీ కందిపప్పు: రూ. 135కే పంపిణీ, క్యూ కట్టిన ప్రజలు

రాయితీ కందిపప్పు: రూ. 135కే పంపిణీ, క్యూ కట్టిన ప్రజలు

రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, తాండూరు తదితర ప్రాంతాల నుంచి కందిపప్పు ఎక్కువగా తరలి వచ్చేదన్నారు. కానీ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో కొరత ఏర్పడిందని ఆయన అన్నారు.

రాయితీ కందిపప్పు: రూ. 135కే పంపిణీ, క్యూ కట్టిన ప్రజలు

రాయితీ కందిపప్పు: రూ. 135కే పంపిణీ, క్యూ కట్టిన ప్రజలు

గతంలో రేషన్ దుకాణాల ద్వారా 3000 మెట్రిక్ టన్నుల కందిపప్పు పంపిణీ చేసేవారని, తమ ప్రభుత్వం రూ. వందల కోట్లు ఖర్చు చేసి ఆరు వేల మెట్రిక్ టన్నులు పంపిణీ చేస్తున్నా విపరీతమైన డిమాండ్ ఉన్నదన్నారు.

రాయితీ కందిపప్పు: రూ. 135కే పంపిణీ, క్యూ కట్టిన ప్రజలు

రాయితీ కందిపప్పు: రూ. 135కే పంపిణీ, క్యూ కట్టిన ప్రజలు

సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చేందుకే దాల్‌మిల్లుల యజమానులతో చర్చించి రూ.135లకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరంతోపాటు జిల్లా, మండల కేంద్రాల్లోనూ రాయితీ కందిపప్పు విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈటల చెప్పారు. ఈ విక్రయ కేంద్రాలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తామన్నారు.

 రాయితీ కందిపప్పు: రూ. 135కే పంపిణీ, క్యూ కట్టిన ప్రజలు

రాయితీ కందిపప్పు: రూ. 135కే పంపిణీ, క్యూ కట్టిన ప్రజలు

సామాన్యులకు కందిపప్పును తక్కువ ధరకు అందించాలన్న సదుద్దేశంతోనే సీఎం కేసీఆర్ అదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నగరంలో 10 సెంటర్లలో ప్రత్యేక రాయితీ కందిపప్పు కౌంటర్లను ఏర్పాటు చేశారు.

 రాయితీ కందిపప్పు: రూ. 135కే పంపిణీ, క్యూ కట్టిన ప్రజలు

రాయితీ కందిపప్పు: రూ. 135కే పంపిణీ, క్యూ కట్టిన ప్రజలు

కుటుంబానికి కిలో చొప్పున రూ. 135కే కందిపప్పు ఇవ్వడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయంతో పాట సీఆర్వో పరిధిలోని తొమ్మిది సర్కిళ్ల వద్ద పౌర సరఫరా అధికారులు సర్కిల్‌కు రెండు చొప్పున కౌంటర్లు ఏర్పాటు చేశారు.

 రాయితీ కందిపప్పు: రూ. 135కే పంపిణీ, క్యూ కట్టిన ప్రజలు

రాయితీ కందిపప్పు: రూ. 135కే పంపిణీ, క్యూ కట్టిన ప్రజలు

అడ్డగుట్ట విఘ్నేశ్వర ట్రేడర్స్ వద్ద మంత్రి పద్మారావు కందిపప్పు కౌంటర్లను ప్రారంభించారు. అనంతరం ప్రజలకు కందిపప్పను పంపిణీ చేశారు. ప్రతి కౌంటర్లలో తొలిరోజు 800 కేజీల కందిపప్పు స్టాక్ ఏర్పాటు చేశామని, రోజూ డిమాండ్ అనుగుణంగా అందుబాటులో ఉంచుతామని పౌర సరఫరాల అధికారులు తెలిపారు.

English summary
MInister Eeetela Rajender Ingurated Subsidised Rate of Toor Dal is Rs.135 at Erragadda Rytu Bazar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X